Monday, December 23, 2024

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై

- Advertisement -
- Advertisement -

Governor Tamilisai Greets People on 73rd Republic Day

హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య భారతదేశ సార్వభౌమత్వాన్ని గర్వంగా జరుపుకునే రోజు గణతంత్ర దినోత్సవమని వివరించారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావంతో భారత రాజ్యాంగాన్ని గొప్పగా రూపొందించిన నిర్మాతలు అంబేద్కర్, ఇతరులకు గవర్నర్ ఘనమైన నివాళి అర్పించారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న వేళ గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని అన్ని వర్గాల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కోవిడ్ మహమ్మారి మొదలు అన్ని రకాలుగా సేవలందిస్తున్న, వ్యాక్సినేషన్ విజయవంతం చేస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్లకు తమిళిసై సెల్యూట్ చేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మూడో మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగంలోని విలువలు, విధానాలు, హక్కుల పరిరక్షణ కోసం 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పునరంకితం అవుదామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News