Monday, December 23, 2024

రాజ్‎భవన్ లో గణతంత్ర వేడుకలు.. జాతీయ జెండాను ఎగరవేసిన గవర్నర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 73వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాజ్‎భవన్ లో మంగళవారం ఉదయం రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, పలువురు ఉన్నాతాధికారులు పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ తమిళసై ప్రసంగించారు. 73వ గణంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు రాజ్ భవన్ లో జాతీయ పతాకం ఆవిష్కరించడం గొప్ప గౌరవంగా బావిస్తున్నాను. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు, రాష్ట్ర ప్రజలకు గవర్నర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనదని, అత్యుత్తమ రాజ్యాంగం అందించిన దార్శనికులకు నివాళులర్పిస్తున్నాని తెలిపారు. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.

Governor Tamilisai hoists National Flag at Raj Bhavan

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News