ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరి కాదు
అది బాధ్యతారాహిత్యం
గవర్నర్ మీడియాతో రాజకీయాలు మాట్లాడకూడదు
ఉ.రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్ని విషయాలు మీడియాతో మాట్లాడట్లేదు : మంత్రులు తలసాని, కొప్పుల
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలపై మంత్రుల ఆగ్రహవేశాలు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం రాష్ట్ర మంత్రు లు తలసాని శ్రీనివాస్‌యాదవ్, కొప్పుల ఈశ్వర్‌లు స్పందించారు. గవర్నర్ తమిళిసై చట్ట పరిధిని దాటి మాట్లాడుతున్నారని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆమె తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరైంది కాదన్నారు.శనివారం వేరువారు ప్రాంతాల్లో మీడియాతో మంత్రులు మాట్లాడుతూ రాజ్యాంగ పపరమైన హోదాలో ఉన్నవారు వారి పరిమితులకు లోబడి మాట్లాడాలని హితవు పలికారు. ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాధ్యతారాహిత్యం అవుతుందన్నారు. గవర్నర్ మీడియాతో రాజకీయాలు మాట్లాడకూదన్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడే అవసరం లేదన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్ని విషయాలు మీడియాతో మాట్లాడలేనని, తనకు పరిధిలు ఉంటాయని హుందాతనంగా వ్యవహరించినట్టు ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రతిపక్ష పార్టీలకు నోటికి బట్ట లేదన్నారు. వరిధాన్యం మీద పోరాటం చేస్తున్నామని , రైతులకు అవసరమైన విధంగా మాట్లాడాలని మంత్రులు కోరారు. రాష్ట్రంలో ఇటువంటి ప్రతిపక్షాలు ఉండటం నిజంగా దురదృష్టకరం అన్నారు. ధాన్యం ఎందుకు కొనరో బిజేపి నాయకులు చెప్పాలన్నారు. కేంద్ర మంత్రి నూకలు తినాలని చెప్పటం బాధ్యతారాహిత్యం అన్నారు. రాష్ట్రంలో 24గంటల విద్యుత్ సరఫరా ఉందని , బిజేపి పాలిత రాష్ట్రాల్లో లేదని అందుకు వాళ్లకు ఈర్షగా ఉందన్నారు. వ్యవస్థలను పనిచేయించాలేగాని పక్కదారి పట్టించవద్దని మంత్రులు తలసాని, కొప్పుల ఈశ్వర్‌లు సూచించారు.