Wednesday, January 22, 2025

గవర్నర్ కోటా ఎంఎల్‌సిల భర్తీపై తమిళిసై సంచలన నిర్ణయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా నామినేటెడ్ ఎంఎల్‌సిల భర్తీ కోసం ప్రభుత్వం నుండి ప్రస్తుతం ఎలాంటి ప్రతిపాదనలు తీసుకోవద్దని ఆమె నిర్ణయించారు. వాటిపై ఇప్పటికే కోర్టులో కేసు ఉందని ఆ కేసు పరిష్కారం అయిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను ఎంఎల్‌సిలుగా నామినేట్ చేస్తూ గత జూలైలో బిఆర్‌ఎస్ మంత్రిమండలి తీర్మానం చేసింది. ఈ నిర్ణయాన్ని గవర్నర్ తమిళిసై గతేడాది సెప్టెంబర్ 19న తిరస్కరించారు. గవర్నర్ తన పరిధి దాటి వ్యవహరించారని, మంత్రి మండలికి ఎంఎల్‌సిలను నామినేట్ చేసే హక్కు ఉంటుందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై పది రోజుల కిందట విచారణ జరిగింది. హైకోర్టులో శ్రవణ్, సత్యనారాయణ తరుపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ, ఆర్టికల్ 171 ప్రకారం క్యాబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆపడానికి వీలు లేదని హైకోర్టు దృష్టికి తెచ్చారు. అయితే ఆర్టికల్ 361 ప్రకారం పిటిషనర్ల పిటిషన్‌కు అర్హత లేదని గవర్నర్ తరుపు కౌన్సిల్ కోర్టుకు వెల్లడించారు.

ఇరువాదనలు విన్న న్యాయమూర్తి పిటిషన్ అర్హతపై వాదనలు వింటామం టూ తదుపరి విచారణ జనవరి 24కు హైకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణ 24వ తేదీన జరగనుంది. తెలంగాణ మంత్రి మండలి కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ పేర్లను సిఫార్సు చేసింది. అయితే వారిని నామినేట్ చేసేందుకు గవర్నర్ అంగీకరించకుండా వాటిని తిరస్కరిం చారు.. వీరిద్దరి పేర్లను తిరస్కరించడానికి గల కారణాలను కూడా ఆమె చెప్పారు. దాసోజు, కుర్రాలు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారని పేర్కొ న్నారు. అలాగే వారు ఎలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లుగా వెల్లడి కాలేదన్నారు. నామినేటేడ్ పోస్ట్‌లకు నిర్ధారించిన 5 రంగాలలోనూ ఈ ఇద్దరు అభ్యర్ధులు లేరని గవర్నర్ తెలిపారు. గవర్నర్ కోటా ఎంఎల్‌సిలను సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్న వారిని సిఫార్సు చేయాలని సూచించారు. అటువంటివారి పేర్లను పంపితే ఆమోదిస్తానని తమిళిసై వెల్లడించారు. అయితే ఆ తర్వాత మరో ఇద్దరి పేర్లను కెసిఆర్ రాజ్ భవన్ కు పంపలేదు. ఈ లోపు ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఓడిపోవడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ కోర్టులో కేసు తేలే వరకూ ఏ సిఫార్సులు అంగీకరించేది లేదని గవర్నర్ ముందుగానే చెప్పడంతో ఆ రెండు స్థానాల భర్తీ ఇప్పుడల్లా ఉండదని తేలిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News