Wednesday, January 22, 2025

పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పెండింగ్ బిల్లులపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.అయితే, రాష్ట్ర ప్రభుత్వం పంపిన డీఎంఈ వయసు విరమణ పెంపు బిల్లును గవర్నర్ తమిళిసై తిరస్కరించారు.దాంతోపాటు పురపాలక చట్ట సవరణ బిల్లు, ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ వివరణ కోరారు.

Also Read: వైశాల్యం తక్కువ.. సంపద ఎక్కువ

కాగా, తాము పంపిన బిల్లులను గవర్నర్ అమోదించకుండా తన వద్దే ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడంలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్) శాంతి కుమారి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇదిలా ఉంటే.. గత కొన్నిరోజులుగా తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ తమిళిపై మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News