మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమత్ షాతో తెలంగాణ గవర్నర్ తమిళిసై బుధవారం రాత్రి భేటీ అయ్యారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై తమిళిసై సౌందర రాజన్ కేంద్ర మంత్రి అమిత్ షాకు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుున్న పరిణామాలపై కేంద్ర మంత్రికి తమిళిసై నివేదిక కూడా ఇచ్చారని సమాచారం. బిజెపి తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాదయాత్ర శిబిరం వద్ద బస చేసిన చోటే దీక్షకు ప్రయత్నిస్తే పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ నుండి కరీంనగర్ జిల్లాలోని తన ఇంటి వద్ద బండి సంజయ్ ను పోలీసులు వదిలివెళ్లారు. బండి సంజయ్ పాదయాత్రను నిలిపివేయాలని కూడా వర్ధన్నపేట పోలీసులు బండి సంజయ్ కు నోటీసులు అందించారు. ఈ విషయమై గవర్నర్ తమిళిసైతో బిజెపి నేతలు మంగళవారం సాయంత్రం భేటీ అయ్యారు. పాదయాత్ర నుండి బండి సంజయ్‌ను అరెస్ట్ చేసిన అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం ఉదయమే తమిళిసై న్యూఢిల్లీకి వెళ్లారు. బుధవారం రాత్రి ఆమె అమిత్ షా తో భేటీ అయ్యారు. మరో వైపు వివాదాస్పద వ్యాఖ్యలతో కూడా వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో హైద్రాబాద్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకొంది. శాంతి భద్రతలను నెలకొల్పేందుకు పోలీసు యంత్రాంగం ఎలా పనిచేస్తుందనే విషయమై కూడా అమిత్ షా ఆరా తీసినట్టుగా సమాచారం. రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందా? అనే విషయాలపై కూడా కేంద్ర మంత్రి ఆరా తీసినట్టుగా మీడియా రిపోర్టు చేసింది.
Governor Tamilisai Meets Amit Shah