- Advertisement -
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిలిసై సౌందర్య రాజన్ మేడారంకు చేరుకున్నారు. ఉదయం 11.05 గంటలకు హెలికాప్టర్ సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లారు. గవర్నర్ కు మంత్రి సీతక్క, ఈటెల రాజేందర్ , జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ప్రత్యేక అధికారులు కృష్ణ ఆదిత్య, అర్.వి.కర్ణన్, శరత్ , జిల్లా ఎస్పీ శబరిష్, ఇతర ఉన్నత పోలీస్ అధికారులు ఘన స్వాగతం పలికారు.
ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలోని సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొనేందుకు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండాతో కలిసి పాల్గొనబోతున్నాను. అప్పటి కాకతీయ రాజవంశానికి వ్యతిరేకంగా తల్లి, కుమార్తె ద్వయం చేసిన వీర పోరాటాన్ని గౌరవించడం, వారి జ్ఞాపకార్థం ఇది ద్వైవార్షిక గిరిజన పండుగ అంటూ గవర్నర్ ట్వీట్ చేశారు.
- Advertisement -