- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మరణించిన ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా వుండాలన్నారు. చికిత్స పొందుతున్న మహిళలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. అలాగే బాధిత మహిళలను పరామర్శించనున్నట్లు తెలిపారు. మరోవైపు ఇబ్రహీంపట్నం ఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లలో మార్పులు చేసింది. రోజుకు 15 మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేలా కొత్త నిబంధన తీసుకొచ్చింది.
Governor Tamilisai reacts on Ibrahimpatnam Incident
- Advertisement -