Monday, December 23, 2024

సెయిలింగ్ జీవిత పాఠాలు నేర్పుతుందన్న గవర్నర్ తమిళిసై

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సెయిలింగ్ పోటీల్లో మహిళలు సైతం పోటీపడటం సాధారణ విషయం కాదని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. మహిళలు జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారని, సెయిలింగ్ అనేది జీవిత పాఠాలు నేర్పుతుందన్నారు. హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్ వద్ద జరిగిన సెయిలింగ్ వీక్ ముగింపు వేడుకలకు గవర్నర్ ముఖ్య అతిథిగా మాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘హైదరాబాద్‌లో చాలా అందమైన హుస్సేన్‌సాగర్ లేక్ ఉంది ఇలాంటి లేక్ చాలా రాష్ట్రాల్లో లేదు. ఇది హైదరాబాద్‌కు ప్రత్యేకం. ఎంతో మంది ప్రతిభల సెయిలర్స్‌ని హుస్సేన్‌సాగర్ ఇచ్చింది. నీటిలో గాలిని తట్టుకొని పడవ నడపాల్సి ఉంటుంది. అలాగే జీవితంలో కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగాల్సి వస్తుంది. ఇలాంటి ఈవెంట్ల ద్వారా సెయిలింగ్‌కి ప్రాచుర్యం వస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో సెయిలింగ్ విభాగంలో భారత్‌కి పథకాలు వచ్చాయి. రాబోయే ఆసియా క్రీడలు, ఒలింపిక్ క్రీడల్లో పథకాలు సాధించాలని ఆశిస్తున్నాం. ఇప్పటికే తెలంగాణకి చెందిన మాన్యరెడ్డి ఏషియన్ సెయిలింగ్‌లో పోటీ పడటం చాలా సంతోషంగా ఉంద’ని గవర్నర్ తమిళిసై అన్నారు.

‘హుస్సేన్ సాగర్ తెలంగాణకు ఒక గిఫ్ట్ లాంటిది. జాతీయ, అంతర్జాతీయ సెయిలర్లు ఇక్కడ సెయిలింగ్ చేస్తుంటారు. ఇలాంటి హుస్సేన్ సాగర్‌ని శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రజలపై కూడా ఉంది. గతంలో హుస్సేన్ సాగర్‌లో సెయిలింగ్ చేసేటప్పుడు పాములు, చేపలు, కప్పలు కనిపించేవని అధికారులు చెబుతున్నారు. కానీ, కాలుష్యం వల్ల ఇప్పుడు అలాంటివి కనిపించడం లేదంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సాగర్‌ని శుభ్రపరచాలని కోరుతున్నా, వచ్చే ఏడాది ఇలాంటి సమస్యలు లేవని చెప్పే విధంగా ఉండాలని ఆశిస్తున్నా’నని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News