Monday, January 20, 2025

48 గంటల్లో టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్ నివేదిక ఇవ్వండి: గవర్నర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. తాజా పేపర్ లీకేజీ నివేదికను రాజ్‌భవన్‌కు పంపాలని ఆదేశించారు. 48 గంటల్లోగా తాజా నివేదికను ఇవ్వాలని సిఎస్, టిఎస్‌పిఎస్‌సి, డిజిపికి ఆదేశాలు జారీ చేశారు. అంతకు ముందు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ టిఎస్‌పిఎస్‌సి కార్యదర్శికి లేఖ రాసిన సంగతి విదితమే.

తన లేఖలో సమగ్ర విచారణకు ఆదేశించి, లీకేజీపై వివరణాత్మక నివేదికను కోరిన సంగతి తెలిసిందే. అసలైన అభ్యర్థుల భవిష్యత్తు, ప్రయోజనాలను కాపాడటానికి ఇటువంటి దురదృష్ట సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలను తక్షణమే తీసుకోవాలని, బాధ్యులందరిపై పై కఠిన చర్యలు తీసుకోవాలని గవర్ననర్ తమిళిసై ఆదేశించిన సంగతి విదితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News