Monday, January 20, 2025

మీర్‌పేట అత్యాచార ఘటనపై నివేదిక కోరిన గవర్నర్ తమిళిసై

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : మీర్‌పేటలో జరిగిన అత్యాచారంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నివేదిక కోరారు. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనం కాలనీలో పదహారేళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్, 48 గంటల్లో వివరణాత్మక నివేదిక ఇవ్వాలని సిఎస్, డిజిపి, రాచకొండ సిపిని ఆదేశించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు తక్షణమే బాధితురాలి నివాసానికి వెళ్లి, ఆమె కుటుంబానికి అవసరమైన సహాయ, సహకారాలు అందించాలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News