Saturday, November 23, 2024

నల్లగొండ జిల్లాలో గవర్నర్ పర్యటన…

- Advertisement -
- Advertisement -

Governor Tamilisai Soundararajan tour in Nalgonda

నల్లగొండ: తెలంగాణ గవర్నర్ తమిళిసై నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం నల్లగొండ పట్టణం పరిధిలోని అర్జాలభావి ఐ కె పి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తొలుత సందర్శించారు. కేంద్రంలో అందుబాటులో ఉన్న అధికారులు, రైతులతో గవర్నర్ తమిలి సై సౌందర్ రాజన్ ముచ్చటించి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. పలువురు రైతులతో మాట్లాడారు.
మీ పేరు ఏమిటి…
ఎన్ని ఎకరాల్లో ఎంత పండించారు….
ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చి ఎన్ని రోజులు అయింది…అంటూ పలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. నేను ఎవరో తెలుసా అంటూ ఒక మహిళా రైతును అడిగారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రైతులను కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
గత సీజన్ లో కంటే ఈ సారి కొనుగోలు కేంద్రాలను ఎక్కువగా ఏర్పాటు చేశారని చెప్పారు. వర్షాలు రైతులను ఇబ్బందులు పెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్నేహపూర్వక వాతావరణంలో రైతులతో మమేకంకావడ౦ సంతోషంగా ఉందన్నారు. సీజనల్ గా వచ్చే విపత్తులు రైతులను బాధ పెడుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. అంతకుముందు నల్లగొండ పట్టణంలో ని షేర్ బంగ్లా లో గల శ్రీ భక్త ఆంజనేయ సహిత సంతోషి మాత ఆలయంలో ధ్వజస్తంభం, మూల విరాట్ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిలి సై సౌందర్ రాజన్ తో పాటు  నల్గొండ ఎంఎల్ఎ కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, పీఠాధిపతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News