Monday, January 20, 2025

గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్..

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై ట్విటర్ హ్యాక్ కు గురైంది. సైబర్ నేరగాళ్లు గవర్నర్ ట్వీటర్ అకౌంట్ ను హ్యాక్ చేసినట్లు రాజ్ భవన్ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవల రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సోషల్ మీడియా అకౌంట్ కూడా హ్యాక్ అయినట్లు తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా గవర్నర్ అకౌంట్ నే హ్యాక్ చేయడంతో సైబర్ నేరగాళ్లను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News