Wednesday, January 22, 2025

ట్రిబుల్ ఐటీలో గవర్నర్ తమిళిసై…

- Advertisement -
- Advertisement -

నిర్మల్: ట్రిబుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐదు రోజుల క్రితం బాసర ట్రిబుల్ ఐటీ విద్యార్థులు గవర్నర్ కు విన్నవించడంతో బాసర పర్యటలో భాగంగా శనివారం రాత్రి హైదరాబాద్ నుండి రైల్లో బయలుదేరి ఆదివారం ఉదయం బాసరకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మొదట సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ట్రిబుల్ ఐటీ కళాశాలకు వెళ్లారు. కళాశాల ఇన్చార్జ్ వైస్ ఛాన్స్ లర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్ కుమార్ లు గవర్నర్ తమిళిసైకి స్వాగతం పలికి కళాశాలలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కళాశాలలో కాలినడకన అన్ని ప్రదేశాలను సందర్శిస్తూ విద్యార్థులతో నేరుగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Governor Tamilisai visit Basara IIIT

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News