Wednesday, January 22, 2025

నా ప్రజలను కలవడానికి వెళ్తున్నా.. భద్రాచలం టూర్‌పై తమిళిసై

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తీసుకున్నారు. హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు వెళ్లి ఆమె వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆజాదీ కా అమృత మహోత్సవ్ గుర్తుగా 75 రోజుల పాటు 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు వారికి ఉచిత వ్యాక్సిన్‌లను సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీకి ఆమె థాంక్స్ చెప్పారు. టీకాలు ప్రాణాలను కాపాడతాయని అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం భద్రచాలం పర్యటన గురించి తమిళిసై సౌందర్ రాజన్ మాట్లాడారు. “నా ప్రజలను కలవడానికి వెళ్తున్నాను” అని తమిళిసై సౌందర్ రాజన్ తెలిపారు.

శనివారం ఢిల్లీ వెళ్లాల్సి ఉందని అయితే ప్రజల దగ్గరకు వెళ్లేందుకు ఆ కార్యక్రమాన్ని రద్దు చేస్తుకున్నానని చెప్పారు. వరదల వల్ల ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారిని కలుస్తానని తెలిపారు. సీఎం కూడా వెళ్తున్నారు.. అది ఆయన డ్యూటీ అని అన్నారు. ఇక, ఇక, గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. వరద పరిస్థితులను పరిశీలించడంతో పాటు బాధితులను పరామర్శించనున్నారు. అయితే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇచ్చే విందులకు హాజరయ్యేందుకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అయితే భద్రాచలం వెళ్లాలని నిర్ణయం తీసుకున్నా ఆమె.. తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు.

Governor Tamilisai visit Bhadrachalam on Sunday

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News