Wednesday, January 22, 2025

కొమురవెల్లి మల్లన్న సన్నిదిలో గవర్నర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కొమురవెల్లిః కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనం అనంతరం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ పురాతనమైన, ఆతిశక్తివంతమైన మల్లికార్జున స్వామిని కార్తీక మాసంలో దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరు మరియుదేశంలోని ప్రజలందరు ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉండాలని కొమురవెల్లి మల్లన్నను కోరుకున్నానన్నారు. కొమురవెల్లి మీదుగా వెళ్లే రైల్వే కనెక్షన్ త్వరగా పూర్తయ్యేలా కేంద్ర రైల్వే శాఖ మంత్రితో ప్రత్యేకంగా మాట్లాడి త్వరగా పూర్తయ్యేలా చూస్తానని తెలిపారు. తెలంగాణ జాతీయ వజ్రోత్సవాల సందర్భంగా విద్యార్ధులు బైరాన్‌పల్లి గ్రామానికి ఆహ్వానించారని, విద్యార్ధుల ఆహ్వానం మేరకు బైరాన్‌పల్లి వెలుతున్నానని తెలిపారు.

దాసారం గుట్టను కాపాడాలని గవర్నర్‌ను కలిసిన సీపీఎం నాయకులు
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర రాజన్‌ను సీపీఎం కొమురవెల్లి మండల నాయకులు సనాది బాస్కర్, రాంసాగర్ సర్పంచ్ తాడురి రవీందర్‌తో కలిసి వినతి పత్రం అందజేశారు. కొమురవెల్లి మండల కేంద్రంలోని సర్వే నంబర్ 223,305/ఎలో గల 22 ఎకరాల భూమిని రియల్టర్ల అక్రమణ నుండి కాపాడి మల్లన్నకు అప్పగించాలని, కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారన్నారు. అనంతరం సీపీఎం నాయకులు మాట్లాడుతూ.. ఇటీవల కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొనుగోలు చేసి దాసారం (సంగన్న, బ్రహ్మగారి) గుట్టను అంత జేసిబిలు పెట్టి గుట్టను తవ్వుతున్నారని ఎలాంటి మైనింగ్ అనుమతులు పనులు చేస్తున్నారని అదే గుట్టకు దేవస్ధానం రూ.4కోట్లు నిధులు వెచ్చించి రోడ్డువేసి, గెస్ట్ హాస్‌లు నిర్మిస్తుందని ఇప్పుడు రియల్ వ్యాపారాలు చేసే పనుల వల్ల దేవస్ధానం వెచ్చించే రూ.4కోట్ల రూపాయలు వృదా అయి ప్రమాదం ఉందని కావున ఇట్టి భూమిని దేవస్ధానంకు అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇతర రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు కొమురవెల్లి దేవస్ధానానికి వస్తారని అలాంటి కొమురవెల్లి వద్ద రైల్వే స్టేషన్ ఏర్పాటు చేపించాలని కోరారు. గవర్నర్ సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తెలంగాణ గవర్నర్‌కు మళ్లీ అవమానం: ప్రోటో కాల్ పాటించని సిద్దిపేట కలెక్టర్, ఎస్పీ
తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్‌కు అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఆమె ఎక్కడికి వెళ్లినా అక్కడి అధికారులు అమెకు స్వాగతం పలుకుతున్న పాపాన పోవడం లేదు. పలుమార్లు ఈ విషయమై గవర్నర్ ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నా అధికారులు మాత్రం ప్రోటోకాల్ పాటించడం లేదు. తాజాగా సిద్దిపేట జిల్లాలో గవర్నర్ తమిళిసైకి అవమానం జరిగింది. ఆమెను సిద్దిపేట జిల్లా కలెక్టర్, ఎస్సీలు అసలు మాత్రం పట్టించుకో లేదు. కనీసం స్వాగతం పలికేందుకు సైతం ముందుకు రాలేదు. నేడు గవర్నర్ తమిళసై కొమురవెల్లి మల్లన్న ఆలయానికి వెళ్లారు. డిఆర్‌ఓ, ఆలయ అర్చకులు గవర్నర్‌కు స్వాగతం పలికారు. ప్రోటో కాల్ ఆంశంలో ఆసంతృప్తి తెలుపుతూ ఇటీవల గవర్నర్ వ్యాఖ్యలు చేశారు. అయినా అదికారులు తీరు మార్చుకోడం లేదు కాగా కొమురవెల్లి మల్లన్న దర్శనం పూర్తి చేసుకొని తమిళసై దూల్మిట్ట మండలం బైరాన్‌పల్లి గ్రామానికి వెళ్లారు.

Governor Tamilisai visit Komuravelli Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News