- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్న గవర్నర్ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ తెలుగు ప్రజలతోపాటు తమిళనాడు ప్రజలు, ఇంకా భారతదేశంలోని ప్రతి ఒక్కరు సంతోషంగా ఆయురా రోగ్యాలతో జీవించాలని, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించినట్లు వెల్లడించారు.
- Advertisement -