Sunday, December 29, 2024

సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న గవర్నర్

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి: సీతారామచంద్ర స్వామి వారిని రాష్ట్ర గవర్నర్ తమిలి సై సౌందర రాజన్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, ఆధికారులు గవర్నర్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. గర్భగుడిలో ప్రత్యేక పూజలు అనంతరం
శ్రీ లక్ష్మి తాయారు అమ్మవారి ఆలయంలో వేద పండితుల చేత వేద ఆశీర్వచనం, స్వామి వారి జ్ఞాపిక, లడ్డు ప్రసాదాన్ని అర్చకులు అందచేశారు. సీతారామచంద్ర స్వామి వారి దర్శనం అనంతరం స్వామి వారి దర్శనానికి విచ్చేసి క్యు లైన్ లో ఉన్న భక్తులను గవర్నర్ పలకరించారు. ఈ కార్యక్రమంలో ఇఒ రమాదేవి, ఆర్.డి. ఓ రత్న కళ్యాణి పాల్గొన్నారు.

Also Read: జూన్ 4న కేరళలో నైరుతి రుతుపవనాల ప్రవేశం

స్వామి వారి దర్శనం అనంతరం వీరభద్ర పంక్షన్ హాల్ లో ఆదివాసీ గిరిజనులతో ముఖాముఖి సమావేశం ఉంటుంది.
ఆరోగ్య అవగాహన, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులతో సమావేశం ఉంటుంది. దేశం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఇక్కడ నివసించే ఆదివాసీల బాగోగులు తెలుసుకోవడానికి ఈ రోజు ఆదివాసీల నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్లు గవర్నర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి భద్రాచలం ఎమ్మెల్యే పోదేం వీరయ్య, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఐటిడిఎ ఎపిఒ జనరల్ డేవిడ్ రాజ్, ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు, గిరిపుత్రులు, ప్రజలు పాల్గొంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News