Tuesday, April 1, 2025

గవర్నర్లు ప్రజా ప్రతినిధులు కారు: సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

చీటికీ మాటికీ రాష్ట్ర ప్రభుత్వాలతో విభేదిస్తున్న గవర్నర్లకు సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది. తాము ఎన్నికైన ప్రజాప్రతినిధులం కామనే విషయాన్ని గవర్నర్లు మరచిపోకూడదని హెచ్చరించింది. రాష్ట్ర చట్టసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు పెండింగ్ లో ఉంచుతున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వాలు తరచూ సుప్రీంకోర్టులో కేసులు వేయడం పట్ల  సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.

గవర్నర్లకు, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఘర్షణలు జరుగుతూ ఉండటం పట్ల భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ పర్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇరుపక్షాలూ ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు చెప్పింది. గవర్నర్ ఏడు బిల్లులను పెండింగ్ లో ఉంచారంటూ పంజాబ్ రాష్ట్ర  ప్రభుత్వం దాఖలు చేసిన పిల్ పై సుప్రీంకోర్టు విచారణకు చేపట్టిన సందర్భంగా పై వ్యాఖ్యలు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News