Wednesday, January 22, 2025

గవర్నర్లు ప్రజాప్రతినిధులు కాదు

- Advertisement -
- Advertisement -

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య

పెండింగ్ బిల్లుల అంశంపై ఆత్మపరిశీలన చేసుకోవాలి

సుప్రీంకోర్టు ముందుకు రాకముందే వాటిని ఆమోదించాలి
సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైన తర్వాత పరిష్కరించే సంస్కృతి సరైంది కాదు

పంజాబ్ ప్రభుత్వ పిటిషన్‌పై త్రిసభ్య ధర్మాసనం

న్యూఢిల్లీ: అసెంబ్లీలో తీర్మానించి పంపిన బిల్లుల కు ఆమోదం తెలపడంలో గవర్నర్లు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని కొన్ని రాష్ట్రాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ తీరుపై అక్కడి ప్ర భుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బి ల్లులకు సంబంధించిన విషయం కోర్టుకు రాకముందే గవర్నర్లు నిర్ణయం తీసుకోవాలని పేర్కొం ది. ఈ విషయంలో గవర్నర్లు ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరం ఉందని కూడా సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాదు ఎన్నికయిన ప్రజాప్రతినిధులం కాదనే విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని గవర్నర్ వద్ద బిల్లులు పెండింగ్‌లో ఉన్న అంశంపై పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధ ర్మాసనం సోమవారం విచారించింది. అంశం కోర్టుకు రాకముందే నిర్ణయం గవర్నర్లు తీసుకోవాలి. విషయం కోర్టుకు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకునే సంస్కృతికి ముగింపు పలకాలి.

గవర్నర్లకు ఆత్మపరిశీలన కూడా అవసరం. వారు ప్రజాప్రతినిధులు కాదనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. కాగా పంజాబ్ గవర్నర్ తరఫున హాజరైన సొలిసిటర్ జ నరల్ తుషార్ మెహతా.. బిల్లులపై గవర్నర్ చర్య లు తీసుకున్నట్లు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్ల్లులకు సంబంధించి పం జాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ అనవసరమైందని అన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు సంబంధించి పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ తీసుకున్న చర్యలపై తాజా నివేదికను అందించాలని సొలిసిటర్ జనరల్‌ను ఆదేశించింది. తదుపరి వి చారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది.

ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వ హయాం లో పంజాబ్ అసెంబ్లీ ఆమోదించిన 27 బిల్లుల్లో 22 బిల్లులకు గవర్నర్ పురోహిత్ ఆమోదం తెలిపారు. చాలా రాష్ట్రాల్లో సిఎంకు, గవర్నర్లకు ఉన్న వైరంలాగే పంజాబ్ సిఎం భగవంత్ సింగ్ మాన్ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య వివాదం నెలకొం ది. పంజాబ్ అసెంబ్లీ ఆమోదించిన బిల్లు ల ఆమోదానికి గవర్నర్ తాత్సారం చేయడంతో రా ష్ట్రప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. గవర్నర్ పురోహిత్ ముఖ్యమంత్రి మాన్‌కు లేఖ రాసిన కొద్ది రోజలు తర్వాత నవంబర్ 1న మూడు ద్రవ్య బి ల్లుల్లో రెండింటికి ఆమోదం తెలిపారు. సభలో ద్రవ్య బిల్లులను ప్రవేశపెట్టాలంటే గవర్నర్ ఆమోదం తప్పనిసరి. అయితే అంతకు ముందు అక్టోబర్ 19 న మాన్‌కు రాసిన లేఖలో గవర్నర్ మూడు ద్రవ్య బిల్లుల ఆమోదాన్ని నిలిపివేశారు. వాటిలో పంజా బ్ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్(సవరణ) బిల్లు, పంజాబ్ గూడ్స్ అండ్ సర్వీసె స్ టాక్స్( సవరణ) బిల్లు), ఇండియన్ స్టాంప్ (పంజాబ్ సవరణ) బిల్లు2023 ఉన్నాయి. బడ్జెట్ సెషన్‌కు పొడిగింపుగా అక్టోబర్ 20 21నిర్వహించిన అసెంబ్లీ సమావేశం చట్ట విరుద్ధమని గవర్నర్ గతంలో వ్యాఖ్యానించారు.

తాజా తీర్పు అనంతరం పరిణామాలను కొద్ది రోజుల్లో సుప్రీంకోర్టు ముందుంచుతామని సొలిసిటర్ జనరల్ తె లిపారు. దీంతో గవర్నర్ తీసుకున్న చర్యలను కో ర్టు ముందుంచాలని న్యాయమూర్తులు జెబి పర్దీవా లా, మనోజ్ మిశ్రాలు కూడా ఉన్న బెంచ్ ఆదేశి స్తూ కేసు తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా సీనియ ర్ అడ్వకేట్, మాజీ అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్, కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు ఇలాంటి పిటిషన్లను దాఖలు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రజల సంక్షేమం కోసం ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు చర్యలు తీసుకోవడం లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News