Wednesday, January 22, 2025

కేంద్రానికి డబుల్ ఝలక్

- Advertisement -
- Advertisement -

గవర్నర్లకు రాజకీయాలెందుకు?

ఇది అధికారాల్లేని లాంఛన పూర్వక పదవి శివసేన సంక్షోభంలో అప్పటి గవర్నర్ వ్యవహార తీరు ఆక్షేపణీయం
రాజకీయ రంగంలోని కీలకాంశాల్లో జోక్యం చేసుకోవడమంటే రాజకీయాలకు పాల్పడడమే
సేనలో సంక్షోభాన్ని నిర్ధారించుకోకుండానే ఉద్ధవ్ థాక్రేను బల పరీక్షకు ఆదేశించడం
రాజకీయమే ఉద్ధవ్‌కు ఎంఎల్‌ఎల మద్దతు లేదని చెప్పడానికి ఆధారాలు ఏవి?
ఇందులో స్పీకర్ వ్యవహార శైలి కూడా వివాదాస్పదంగా ఉంది
అయినా.. సిఎం పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసినందున థాక్రేను మళ్లీ సిఎం పీఠంపై కూర్చోబెట్టలేం: సుప్రీం కోర్టు ధర్మాసనం సంచలన తీర్పు

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి పీఠంపై ఒరిజినల్ శివసేన నేత ఉద్ధవ్ థాకరేకు కొంత మేరకు ఉన్న ఆశలు ఆవిరయ్యాయి. ఉద్ధవ్ థాకరేను తిరిగి మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంపై కూర్చోబెట్టడం కుదరని పని అని సుప్రీంకోర్టు గురువారం తన తీర్పులో స్పష్టం చే సింది. అప్పటి మహా వికాస్ అఘాధీ (ఎంవిఎ) తర ఫున ఉద్ధవ్ సిఎంగా వ్యవహరించారు. అక్కడి అప్పటి గవర్నర్, అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాలు సరికాదు. గవ ర్నర్ తీరు పూర్తిగా మరో వర్గానికి ప్రయోజనం చేకూ ర్చేదిగా ఉందని తీర్పులో తెలిపింది. అయితే గత ఏ డాది జూన్‌లో ఉద్ధవ్ సభలో విశ్వాస పరీక్షకు వెళ్ల కుండానే రాజీనామా చేసిన దశలో ఇక ఆయన పదవీ పునరుద్ధరణ అంశం ప్రస్తావనకే రాదని ప్రధాన న్యా యమూర్తి డివై చంద్రచూడ్‌తో కూడిన ఐదుగురు స భ్యుల రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. ఆయన బల పరీక్షకు వెళ్లలేదు.

స్వచ్ఛందంగా రాజీనామా చేసిన ప్పుడు, మాజీ సిఎంగా మిగిలినప్పుడు తిరిగి సిఎంగా ఆయనను పునరుద్ధరించడం సాధ్యం కాదని తెలిపారు. శివసేన పార్టీలో సంక్షోభం ఆ తరువాత ప్రభుత్వ పతనం వంటి విషయాలపై ఉద్ధవ్ వర్గం, తిరుగుబాటు పక్షం అయిన షిండే వర్గం దాఖలు చేసిన వ్యాజ్యాలపై రాజ్యాంగ ధర్మాసనం విచారణల తరువాత స్పందించింది. ఉద్ధవ్‌ను తిరిగి సిఎంగా తీసుకురావడం కుదరదు. అయితే ఇదే సమయంలో అప్పటి గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ వ్యవహరించిన తీరు సరికాదని , అప్పటి సభలో థాకరే మద్దతు కోల్పోయ్యారని తెలిపే తగు సమాచారం ఆయన వద్ద లేనప్పుడు , కేవలం ఓ పార్టీలోని అంతర్గత విషయాలను పరిగణనలోకి తీసుకుని సభలో బలపరీక్షకు పిలవడం సరికాదన్నారు. గవర్నర్ చర్య , ఈ దశలోనే స్పీకర్ నిర్ణయాలు అనుచితం అయితే ఇవి తప్పుపట్టేవిగానే ఉన్నప్పటికీ సిఎంగా ముందుగానే ఉద్ధవ్ వైదొలగడం వల్ల , షిండే సారధ్యపు ప్రభుత్వ స్థాపనకు అవకాశం ఇవ్వడంలో తప్పేమి లేదని ధర్మాసనం సమర్ధించింది.

ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో న్యాయమూర్తులు ఎంఆర్ షా, క్రిష్ణ మురారీ, హిమా కోహ్లీ, పిఎస్ నరసింహ సభ్యులుగా ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉందనే సమాచారం అందిందని పేర్కొంటూ గవర్నర్ బలపరీక్షకు పిలవడం సరైన ప్రాతిపదిక లేని విషయం అని ధర్మాసనం తెలిపింది. ఇక గవర్నర్‌తో పాటు స్పీకర్ రాహుల్ నార్వేకర్ తీరు కూడా వివాదాస్పదంగా ఉందన్నారు. షిండే వర్గానికి చెందిన భరత్ గోగావాలేను శివసేన విప్‌గా నియమించడం అసమంజనం అని తీర్పులో పేర్కొన్నారు. చాలా అక్రమాలు జరిగాయి. అయితే ఉద్ధవ్ బలపరీక్షకు వెళ్లి ఉండి, పరిణామాలను ఎదుర్కొని ఉండి ఉంటే తాము ఆయన పూర్వపు స్థానాన్ని పునరుద్ధరించి ఉండేవారమని ధర్మాసనం తెలిపింది. ఇప్పుడు తాము కేవలం ఆయన తరువాత షిండే వర్గం ప్రభుత్వం ఏర్పాటు సమర్థనీయమే అని చెప్పడం జరుగుతోందని పేర్కొన్నారు. ఇప్పటి తీర్పు ఏకగ్రీవంగా ఎటువంటి అభిప్రాయభేదాలకు తావులేకుండా వెలువరించారు.

గవర్నరు రాజకీయాలు కుదరవు
ఓ రాష్ట్రం గవర్నర్ రాజకీయ రంగంలోని కీలక అంశాలలో కలుగచేసుకోకుండా ఉండాల్సిందే. ఒకవేళ ఈ విధంగా వ్యవహరిస్తే అటువంటి గవర్నర్ తన బాధ్యతలు విస్మరించి రాజకీయాలకు పాల్పడినట్లే అవుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. మహారాష్ట్ర అప్పటి గవర్నర్ కోశ్యారీ తీరును తీవ్రంగా తప్పుపట్టింది. పార్టీల అంతర్గత, పార్టీల మధ్య వ్యవహారాలతో గవర్నరుకు ఏం పని? సంక్షోభాలు వచ్చినప్పుడు గవర్నర్ వ్యవహరించే విషయాలు వేరే ఉంటాయి. అయితే సంక్షోభం నిర్థారించుకోకుండానే జోక్యం చేసుకోవడం రాజకీయమే అవుతుందని, పరోక్షంగా తెరవెనుక రాజకీయాలను ప్రోత్సహించి రాజకీయాలకు పాల్పడినట్లుగా భావించాల్సి ఉంటుందని రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం తరఫున 141పేజీల తీర్పు వెలువరించారు. 2022 జూన్ 30 నాటి పరిణామంలో ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండేను గవర్నర్ ఆహ్వానించడం సరైనదే, సిఎంగా ఉద్ధవ్ రాజీనామాకు దిగడ ం వల్ల రాజ్యాంగ సంక్షోభం దిశలో ఆయన ఈ చర్యకు పాల్పడటం సమర్థనీయమే అయితే అంతకు ముందు ఆయన కేవలం రాజకీయాలకు పాల్పడినట్లుగా నిర్థారించాల్సి వస్తోందని ధర్మాసనం పేర్కొంది.

గవర్నర్ పదవి అనధికారిక వ్యవస్థనే దీనిని కాదనరాదు
గవర్నర్ ఓ రాష్ట్రానికి సంబంధించి కేవలం అధికారాలు లేని లాంఛనప్రాయ బాధ్యతలలో ఉంటారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులతో ఏర్పడే ప్రభుత్వానికే సరైన కార్యాచరణ అధికారం ఉంటుంది. ఇదే దశలో రాజ్యాంగపరంగా ఎన్నిక ప్రక్రియ లేకుండా ఉండే గవర్నర్‌కు కేవలం పరిమిత విశేషాధికారాలు ఉంటాయని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. గవర్నర్ రాష్ట్ర మంత్రి మండలి నుంచి సూచనలు సలహాలు తీసుకోకుండా వ్యవహరించడం అసాధారణ స్థాయి కిందికి వస్తుందని తెలిపారు. తనకు తాను దీనికి మించి గవర్నర్ చర్యలకు దిగితే అది ఖచ్చితంగా తనకు రాజ్యాంగపరంగా దక్కిన పరిమిత అధికారాన్ని దుర్వినియోగపర్చడమే అవుతుంది. ఇటువంటి చర్యకు దిగితే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిన వారవుతారని ధర్మాసనం ఆక్షేపించింది.

షిండే సహా 16 మంది ఎమ్మెల్యేలు వేటుపడ్డవారైనట్లే
ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్
సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో ఇప్పుడు ఏక్‌నాథ్ షిండే, 16 మంది రెబెల్ ఎమ్మెల్యేలు అనర్హత వేటుకు గురైన వారే అవుతారని ఉద్ధవ్ శివసేన నేత సంజయ్ రౌత్ తెలిపారు. స్పీకర్ తీరు సరిగ్గా లేదని, విప్‌గా సునీల్ ప్రభు నియామకమే చెల్లనేరుతుందని, మరో విప్‌ను నియమించి వ్యవహారాలు నడిపించడం అనుచితం అని పేర్కొన్నప్పుడు అంతకు ముందే ఎమ్మెల్యేలుగా అనర్హతకు గురైన షిండే, 16 మంది ఎమ్మెల్యేలు స్థానాలను కోల్పోయిన వారే అవుతారు కదా ? అని రౌత్ ముంబైలో ప్రశ్నించారు. అనర్హతకు గురైన వారితో ప్రభుత్వం ఏర్పాటు కావడం, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు దారితీసిన ప్రక్రియ అనుచితం అక్రమం అయితే ఇక ఇప్పుడున్న షిండే ప్రభుత్వం అక్రమం చట్టరీత్యాచెల్లనేరనిదే అవుతుందని రౌత్ తెలిపారు. ఉద్ధవ్ వర్గానికి చెందిన సునీల్ ప్రభు అధికారిక విప్ ఉండటమే సముచితం అని సుప్రీంకోర్టు రూలింగ్ క్రమంలో స్పష్టం అయిందని ఇక రెబెల్ ఎమ్మెల్యేల (షిండేసహా) పై పడ్డ అనర్హత వేటు కొనసాగుతున్నట్లుగా భావించాల్సి ఉంటుంది. అనర్హతతో ఉన్న వ్యక్తులతో ప్రభుత్వానికి చట్టబద్ధత ఉంటుందా? అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News