- Advertisement -
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో గురువారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల 51వ సమావేశం జరగనున్నది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు(యుటి) చెందిన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతోపాటు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఈ సమావేశంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. రాష్ట్రపతి అధ్యక్షతన గవర్నర్ల సమావేశం జరగడం దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి సాంప్రదాయంగా వస్తోంది. గవర్నర్ల మొదటి సమావేశం 1949లో రాష్ట్రపతి భవన్‌లో జరిగింది. నాటి సమావేశానికి అప్పటి భారత గవర్నర్ జనరల్ సి రాజగోపాలచారి అధ్యక్షత వహించారు. రాష్ట్రపతి కోవింద్ నిర్వహిస్తున్న నాలుగవ గవర్నర్ల సమావేశం ఇది.
- Advertisement -