Sunday, December 22, 2024

కవులు, కళాకారులకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవి

- Advertisement -
- Advertisement -

రాజకీయ నాయకులకు సేవ చేస్తే ఇవ్వరు: కిషన్‌రెడ్డి

మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు చేసిన ఇద్దరు ఎమ్మెల్సీను గవర్నర్ తమిళసై తిరస్కరించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా బిఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రభుత్వం సిఫార్సు చేసింది. వారి పేర్లు పరిశీలించిన గవర్నర్ తమిళిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 171(5) ప్రకారం ఎంపిక జరగలేదని వెల్లడించారు. దాసోజు శ్రవణ్ కుమార్, కుర్ర సత్యానారాయణ సామాజిక సేవా కార్యక్రమాలు, సేవా విభాగాల్లో పాల్గొన్నట్లు ఆధారాలు లేవని, అందుకే వారి అభ్యర్ధిత్వాలను తిరస్కరిస్తున్నట్లు ప్రభుత్వానికి ప్రత్యేక లేఖ రాశారు.

దీంతో గవర్నర్ తమిళిసై పై బిఆర్‌ఎస్ నేతలు విరుచుకపడ్డారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ అభ్యర్ధిత్వాన్ని తమిళిసై తిరస్కరించడాన్ని ఆయన సమర్ధించారు. గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని కిషన్ రెడ్డి స్వాగతించారు. కవులు, కళాకారులు, సేవ చేసే వారికే గవర్నర్, రాష్ట్రపతి కోటాలో ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తారని తెలిపారు. కానీ కేసీఆర్ కుటుంబానికి దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ సేవ చేస్తున్నారన్నారు. ఇప్పటికే పలు పార్టీలు ఫిరాయించారని గుర్తు చేశారు. ఇలాంటి వారిని గవర్నర్ తిరస్కరించడం మంచిదేనన్నారు. ఈ విషయంలో గవర్నర్ బాధ్యతగా వ్యవహరించారని తెలిపారు. అందుకే ఎమ్మెల్సీ సిఫార్సులను గవర్నర్ తమిళి సై రిజెక్ట్ చేసినట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News