Sunday, January 12, 2025

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం వాస్తవాలకు దూరంగా ఉంది: ఎంపీ లక్ష్మణ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగం వాస్తవాలకు దూరంగా ఉందని బిజెపి ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. కేవలం పొగడ్తల కోసం కాంగ్రెస్ పార్టీ పాకులాడిందని, ప్రజా సమస్యల పరిష్కారం దిశగా స్పష్టత లేకుండా గవర్నర్ ప్రసంగం రూపొందించారన్నారు. గవర్నర్ ప్రసంగం చూస్తే హామీల అమలుపై అనుమానాలు ఉన్నాయన్నారు.

తమ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆరు గ్యారంటీలకు నిధులు ఎలా తెస్తారో స్పష్టత లేదని, గవర్నర్ ప్రసంగంలో రైతు రుణమాఫీ, రైతుబంధు మాటల ప్రస్తావన లేదన్నారు. మొదటి కేబినెట్ సమావేశంలోనే మెగా డీఎస్సీపై ప్రకటన చేస్తామని గొప్పగా చెప్పి సభలో మాత్రం ఆ విషయం విస్మరించారని విమర్శించారు. హామీల అమలుకు కొత్త ప్రభుత్వానికి వంద రోజులు సమయం ఇస్తామని, తరువాత ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News