కర్ణాటక, మహరాష్ర్టలో గోవింద్ పన్సారే, నరేంద్ర దభోల్కర్, గౌరి లంకేష్, ఎం.ఎం. కల్బుర్గి వంటి మేధావుల హత్యకు వెనుక నిషేధిత హిందూ అనుకూల సనాతన సంస్కార్ పాత్రపై ఈనెల 12న బొంబాయి హైకోర్టులో విచారణ జరగనుంది. వీరి పాత్రకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని కోరుతూ గోవింద పన్సారే కుటుంబ సభ్యులు మహరాష్ర్ట యాంటీ టెర్రరిస్టు స్క్యాడ్ (ఎటిఎస్) అధిపతి జయంత్ మీనాకు గత నెల 27న లేఖ రాశారు. నరేంద్ర దభోల్కర్ కుటుంబ సభ్యులైన డాక్టర్ మేఘా పన్సారే, స్మిత పన్సారే, న్యాయవాది కబీర్ పన్సారే రాసిన లేఖ ఆధారంగానే బొంబాయి హైకోర్టులో ఈ విచారణ జరగనుంది. ఈ నలుగురు మేధావులు హిందుత్వ తీవ్రవాదానికి వ్యతిరేకంగా పని చేయడానికి, వారి హత్యకు ఉన్న సంబంధాన్ని ఈ లేఖ ద్వారా వారు వెల్లడించారు.
‘పన్సారే హత్య కేసులో దాఖలు చేసిన అయిదు చార్జిషీట్‌లను మీ దృష్టికి తీసుకు రాదలిచాం.ఈ కేసులో ఉన్న పన్నెండు మంది నిందితుల్లో ఇద్దరు తప్పించుకుని తిరుగుతున్నారని ప్రకటించారు. నిందితులంతా సనాతన్ సంస్కార్‌కు, హిందూ జాగృతి సమితికి చెందిన వారు. డాక్టర్ నరేంద్ర దభోల్కర్, ప్రొఫెసర్ ఎం.ఎం. కల్బుర్గి, గౌరీ లంకేష్, నలసోపర హత్య కేసులో వీరి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్న కేసులో, దీనికి సంబంధించిన ఇతర కేసుల్లో నిందితులైన వీరందరి మధ్య సంబంధాలు ఉన్నాయి.నిందితుల జాబితాలో ఉన్న వీరందరూ సనాతన్ సంస్కార్ సభ్యులు మాత్రమే కాకుండా, హత్యలో వీరి పాత్రను చార్జిషీట్ ప్రతిబింబిస్తోంది.ఈ హత్య కేసుల్లో సనాతన్ సంస్కా, ‘సాదాక్స్’ పాత్ర గురించి, ఇతర దారుణమైన నేరాల్లో కూడా వీరి పాత్ర గురించి యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్, సిబిఐ, మహారాష్ర్ట పోలీసులు, కర్ణాటక పోలీసులు, గోవా పోలీసులకు బాగా తెలుసునని గోవింద్ పన్సారే కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
‘ఏదిఏమైనప్పటికీ దర్యాప్తు సంస్థలకు కారణాలు తెలుసు. ఆ కోణంలో దర్యాప్తు జరగలేదు. జయంత్ అథ్‌వాలె, వీరేంద్ర మరాఠే మార్గదర్శకత్వంలో వారి సూచనలను పాటిస్తున్న ‘సనాతన్ సంస్కార్’ పాత్ర గురించి దర్యాప్తు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది’ అని ఆ లేఖ ‘సనాతన్ సంస్కార్’ కున్న వ్యవస్థీకృతమైన నిర్మాణ వ్యవస్థను, ఈ హత్యల వెనుక ఉన్న ఆలోచనను వివరంగా తెలియచేసింది. ఒక వ్యవస్థీకృత నేరాలు చేయడానికి ఆయుధాలను కలిగి ఉండడం, మాదక ద్రవ్యాలను ఉపయోగించడం, మానసిక జబ్బులకు ఉపయోగించే మందులు సేకరించడం, నిధులు సమకూర్చడం, తీవ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సాయం చేయడం, ఆయుధ శిక్షణ నివ్వడం వంటి ఉదాహరణలను ఆ లేఖ చూపించగలిగింది. నమోదైన ‘సనాతన్ సంస్కార్’ నిర్వహించిన శిక్షణకు సంబంధించిన వివరాలను చూపించినప్పటికీ, దీని వెనుక ఉండి నిర్వహించే వారిని గుర్తించడానికి దర్యాప్తు జరగలేదు.
నిందితులకు సంబంధించిన వ్యవస్థీకృత ఉద్యమం గురించి, వారికి వనరులు సమకూర్చడం గురించిన సాక్ష్యాలను చూపించే విధంగా దర్యాప్తు జరగలేదు. డాక్టర్ వీరేంద్ర అథవాడే మాత్రమే వీటన్నిటినీ సమకూర్చలేదని రికార్డులలో స్పష్టంగా ఉంది. ఈ హత్యల వెనుక ఉన్న సూత్రధారులు పెద్దఎత్తున ఉన్నప్పటి వారిని దర్యాప్తు ముందుకు తీసుకురాలేదు’. ‘వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిని వారికి శిక్షణ ఇవ్వడంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మేధావులు ఆశ్రయం కల్పించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకురాదలిచాం. నిందితులకు జలానా, నాలాసోపరా, పునూ, సతారా, బెల్‌గావి తదితర ప్రాంతాల్లో ఇళ్ళను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క నిందితుడికి చిక్కాలే, వెల్‌గావి, కర్ణాటక, పోకల, వడ్‌గావ్, జల్నా, ముల్ఖేద్, ముల్షి, పుణె తదితర వేరువేరు ప్రాంతాల్లో ఆయుధ శిక్షణ నిచ్చారు.
ఇప్పుడు మేం చెపుతున్న వాస్తవాలన్నీ రికార్డుల్లో ఇప్పటికే ఉన్నాయి. పన్సారే కేసు విచారణలో యాంటీ టెర్రరిస్ట్ స్వ్యాడ్ వీటిని పరిగణించడంలో విఫలమైంది’. ‘నలసోపరా కేసులో యాంటీ టెర్రరిస్ట్ స్వ్యాడ్ సమర్పించిన చార్జిషీట్‌లో వర్గీకరించిన రికార్డులను పరిశీలించినట్టయితే, ‘సనాతన్ సంస్కార్’, దాని సభ్యులు సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేయడానికి క్షాత్రదరశన్ సాధన కల్పించిన అవగాహన ద్వారా పెద్ద ఎత్తున తీవ్రవాద చర్యలకు పాల్పడ్డారు’ అని ఆ లేఖ పేర్కొన్నారు. నలసోపరా పేలుడు పదార్థాల స్వాధీనం కేసుకు సంబంధించి, పెద్ద సంఖ్యలో పిస్తోళ్ళు, బాంబులు, పేలుడు పదార్థాలను 2018లో మహారాష్ర్ట యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ స్వాధీనం చేసుకుని, ‘సనాతన్ సంస్కార్’, హిందూ జాగరణ్ మంచ్‌కు చెందిన పన్నెండు మంది నిందితులపైన 2019 ఫిబ్రవరి 18 చార్జిషీట్ దాఖలు చేసింది.
‘పెద్ద సంఖ్యలో ఉన్న నిందితులకు అతీతంగా, ఈ అతిపెద్ద కుట్రలో, కుట్రను అమలుపరచడంలో పెద్దపెద్ద ఆలోచనలు పనిచేశాయనే వాస్తవాలను, ఆధారాలను ప్రభుత్వమే సమర్పించింది. దర్యాప్తు సంస్థలు కుట్రలో భాగమైన ‘సనాతన్ సంస్కార్’ కార్యవర్గ సభ్యులను కూడా విచారించాల్సిన అవసరాన్ని కొట్టిపారేయలేం. హత్యలు చేయడానికి, బాంబులు విసరడానికి నిందితుల ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా వారిపై మానసిక వైద్యానికి ఉపయోగించే మందులను వాడారు. ‘సనాతన్ సంస్కార్’ సభ్యులు మాత్రమే పాల్గొనడం ద్వారా ఈ కుట్ర జరిగిందని చెప్పలేం’ ఈ నేరాల తీవ్రతను బట్టి ‘సనాతన్ సంస్కార్’ పాత్రను పరిశీలించాలని, ‘జయంత్ అథవాలే, వీరేంద్ర మరాఠీల మార్గదర్శకత్వంలో వ్యవస్థీకృతమైన తీవ్రవాద నిర్మాణ వ్యవస్థ ఆధ్వర్యంలో అది పని చేసింది’ అని పేర్కొన్నారు.
‘సనాతన్ సంస్కార్’ హింసాత్మక సిద్ధాంతాలను కీర్తించడంతోపాటు ‘హిందూ వ్యతిరేకి’ అని ముద్రవేసి చంపడం, శిక్షపడిన వారు, నిందితులు ‘సనాతన్ సంస్కార్’ చేపట్టిన సిద్ధాంతంతో మమేకమవ్వడమే కాకుండా అది పెంచి పోషించిన వారని, జయంత్ అథ్వాలే, వీరేంద్ర మరాఠే ఆ సంస్థ వ్యవస్థాపకులే కాకుండా దాని నాయకులు కూడా. ‘పన్సారే తను నమ్మిన లౌకికవాదం, హేతువాదం, సమానత్వం, అట్టడుగు వర్గాల వారి కోసం జీవితాంతం పనిచేసిన శివాజీ కోన్ హోటా వంటి వారి సిద్ధాంతం ప్రకారం ‘సనాతన్ సంస్కార్’, హిందూ జనజాగరణ్ మంచ్ వంటి హిందూసంస్థలను తీవ్రంగా వ్యతిరేకించారు’ అని ఆ లేఖలో వివరించారు. పన్సారే హత్య కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న ‘సనాతన్ సంస్కార్’ వ్యవస్థాపకులు డాక్టర్ జయంత్ అథవాలే, దాని నాయకుడు వీరేంద్ర మరాఠే పైన సమర్పించిన ఆధారాలను, రికార్డులను పరిశీలించి తగిన చర్చలు తీసుకోవాలని పన్సారే కుటుంబ సభ్యులు కోరారు.
‘డాక్టర్ దభోల్కర్, పన్సారే హత్యల వెనుక ‘సనాతన్ సంస్కార్’, దాని నాయకుల ఆలోచన ఉందని మీకు సమర్పించిన మా పరిశీలనలు స్పష్టం చేస్తున్నాయి. డాక్టర్ దభోల్కర్ హత్య కేసులో కుట్రకు పాల్పడిన ‘సనాతన్ సంస్కార్’, దాని నాయకుల పాత్రపైన దర్యాప్తు చేయడంలో సిబిఐ విఫలమైందని, దీనిపైన దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నాం.ఈ నలుగురి హత్య వెనుక ‘సనాతన్ సంస్కార్’ వ్యవస్థీకృతమైన నేర నిర్మాణ వ్యవస్థ ఉందన్న విషయం గమనించినందుకు మిమ్మల్ని అభినందించాలి. ‘సనాతన్ సంస్కార్’ కు చెందిన సభ్యులు ఘోరమైన నేరాల్లో దశాబ్ద కాలంగా శిక్ష అనుభవిస్తున్నారు’ అని ఆ లేఖలో గుర్తు చేశారు.
నలుగురు మేధావుల హత్యల నేపథ్యం
హేతువాది, కార్మిక నాయకుడు, సామాజిక కార్యకర్త, కమ్యూనిస్టు పార్టీ సభ్యుడైన డాక్టర్ గోవింద పన్సారేపైన కొల్హాపూర్‌లోని ఆయన ఇంటి సమీపాన మోటారు సైకిల్ పైన వచ్చిన ఇద్దరు యువకులు కాల్పులు జరిపారు. ఈ సంఘటన జరిగిన నాలుగు రోజుల అనంతరం 2015 ఫిబ్రవరి 20వ తేదీన ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఆయన కన్నుమూశారు. తొలుత ఈ కేసును రాష్ర్ట సిఐడికి చెందిన ప్రత్యేక పోలీసు బృందం దర్యాప్తు చేపట్టి 12 మంది నిందితులను అరెస్టు చేసింది. ఈ నేరంలో అసలు నిందితులను రా్ర ష్ట సిఐడి పట్టుకోలేకపోయిందని పన్సారే కుటుంబ సభ్యుల ఆరోపణతో కేసును 2022లో యాంటీ టెర్రరెస్టు స్క్వాడ్‌కు అప్పగించారు.
ఇది అప్పటి నుంచి సీల్డ్ కవరులో తరుచూ కోర్టుకు సమర్పిస్తోంది.డాక్టర్ నరేంద్ర దభోల్కర్ హేతువాది, అతీంద్రియ శక్తుల గుట్టువిప్పే సామాజిక కార్యకర్త, మహారాష్ర్ట అంధ శద్ద్ర నిర్మూలన్ సమితి వ్యవస్థాపకులు. ఆయన్ని పుణెలోని ఓంకారేశ్వర గుడి వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు 2013 జూన్ 20 కాల్చి చంపారు. ప్రొఫెసర్ మల్లేశప్ప మదివలప్ప కల్బుర్గి ప్రముఖ పండితుడు, రచయిత. ధార్‌వాడ్‌లోని కల్యాణ్ నగర్‌కాలనీలో 2015 ఆగస్టు 30న ఇద్దరు గుర్తు తెలియని ఆయన్ని వ్యక్తులు ఆయన్ని కాల్చి చంపారు. సామాజిక కార్యకర్తగా మారిన జర్నలిస్టు గౌరీ లంకేష్ బెంగళూరులోని ఆమె నివాసంలోనే 2015 సెప్టెంబర్ 5న కాల్చి చంపారు. తన తండ్రి పి లంకేష్ స్థాపించిన కన్నడ వార పత్రిక లంకేష్ పత్రికకు ఎడిటర్‌గా చేస్తున్నారు. తాను స్థాపించిన తన సొంత పత్రిక గౌరి లంకేష్ పత్రిను కూడా ఆమె నడిపారు.