Sunday, December 22, 2024

ఆసుపత్రి నుంచి గోవింద డిశ్చార్జి

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రమాదవశాత్తు రివాల్వర్ పేలడంతో కాలికి గాయమైన సినీ నటుడు గోవింద నాలుగురోజులు ఆసుపత్రిలో చికిత్స పొంది శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన సభ్యుడైన గోవిందకు మంగళవారం ఇక్కడి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీ జరిగింది. ఎడమ కాలికి బ్యాండేజ్ వేసుకుని వీల్ చెయిర్‌లో ఆసుపత్రి నుంచి వెలుపలికి వచ్చిన గోవింద తన అభిమానాలకు, మీడియాకు అభివాదం చేశారు. ఆయన వెంట ఆయన భార్య సునీతా ఆహుజ, కుమార్తె అనూజా ఆహుజ ఉన్నారు. గోవిందకు ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించినట్లు సునీత తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News