Sunday, December 22, 2024

ప్రభుత్వ విజయాలను ప్రచారానికి వాడుకోవద్దు : నితీష్

- Advertisement -
- Advertisement -

పాట్నా : బీహార్ ప్రభుత్వ విజయాలను పార్టీలు వ్యక్తిగత ప్రచారానికి వాడుకోవద్దని సీఎం నితీష్‌కుమార్ కోరారు. బీహార్ స్టేట్ పవర్ (హోల్డింగ్ ) కంపెనీ లిమిటెడ్ 11వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బుధవారం రూ.14 వేల కోట్ల విలువైన విద్యుత్ ప్రాజెక్టులను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏడు పార్టీలతో కూడిన మహాఘట్ బంధన్ కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ మిత్రపక్షంలో కొందరు ప్రభుత్వ విజయాలను తమ పార్టీల క్రెడిట్ చెప్పుకుంటున్నారని, ప్రభుత్వం చేసిన మంచి పనిని వారి పార్టీకి లబ్ధి చేకూర్చేలా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని విమర్శించారు. తాను బీహార్‌లో ఏదైనా మంచి పని చేస్తే వ్యక్తిగత విజయంగా ఎప్పుడూ మాట్లాడలేదని , ఈ విషయాన్ని మంత్రులంతా గుర్తుంచుకోవాలన్నారు. పార్టీలు లబ్ధి పొందాలని చూడకుండా ప్రభుత్వానికి క్రెడిట్ ఇవ్వాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News