Thursday, January 16, 2025

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు గుడ్ న్యూస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గం గురువారంనాడు పలు కీలక నిర్ణయాలు తీసుంది. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు శుభవార్త చెప్పింది. 8 వ వేతన సంఘం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వేతన సంఘం సిఫార్సుల మేరకు వేతనాలు పెరగనున్నాయి. 2026 జనవరి 1 నుంచి కొత్త వేతనాలు అమలు లోకి రానున్నాయి. త్వరలోనే కొత్త కమిషన్ ఛైర్మన్, ఇద్దరు సభ్యులను నియమించనున్నారు. మోడీ ప్రభుత్వం 2016లో అమలు లోకి తీసుకువచ్చిన 7 వ వేతన సంఘం సిఫార్సులు ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనుండగా, ఎనిమిదో వేతన సంఘం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలు లోకి రానుంది.

ఉద్యోగులు, పెన్షనర్లు, ట్రేడ్ యూనియన్లు 8 వ వేతన సంఘం సిఫార్సుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే నెలలో కేంద్రం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లోనే కేంద్ర కేబినెట్ సమావేశమై పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News