Wednesday, January 22, 2025

ప్రభుత్వం ప్రత్యేక న్యాయవాదిని ఏర్పాటు చేయడం హర్షణీయం:  ఓయూ విద్యార్థి నేతలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో వాదనలు జరుగుతున్న కీలక సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాదిని ఏర్పాటు చేయడం పట్ల మాదిగ విద్యార్ది నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఓయూ ఆర్ట్ కళాశాల వద్ద సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి మాదిగ, మాదిగ ఉప కులాల విద్యార్థులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఓయూ పిహెచ్‌డి నరసింహ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అంశం మాదిగ, మాదిగ ఉపకులాల మూడు దశాబ్దాల ఆకాంక్ష అన్నారు.

ఎస్సీ వర్గీకరణ అంశం పై జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మాదిగ ప్రజా ప్రతినిధులను సమన్వయం చేస్తున్న ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన మాదిగ, మాదిగ ఉప కులాలు, ప్రజాస్వామ్యవాదులు నిలబడేలా, మాదిగ విద్యార్థులే బాధ్యత తీసుకోవాలని నరసింహ సూచించారు. ఈ కార్యక్రమంలో రీసెర్చ్ స్కాలర్స్ విద్యార్థులు అంబేద్కర్ ,సురేష్ ,క్రాంతి ప్రశాంత్, విజయ్ ,మంద రాజు, హరి ,సంజు సాయి, పార్ధు, పుట్ట రంజిత్ ,అనిల్ ,జింక రాజు ,కొండారెడ్డిపల్లి శేఖర్ ,నక్క వెంకటేష్ , రవితేజ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News