Monday, December 23, 2024

ప్రైవేట్ టీవీ ఛానళ్లలో ప్రజాసేవ సమాచార ప్రసారానికి ప్రభుత్వం ఆమోదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రైవేట్ ఛానళ్లు రోజూ 30 నిమిషాల పాటు ప్రజాసేవ సమాచారాన్ని ప్రసారం చేసుకోవచ్చని ప్రభుత్వం సోమవారం ఆమోదం తెలిపింది. ఈమేరకు ఇతర టెలివిజన్ ఛానళ్లు కార్యక్రమాలను పొందుపర్చుకోవచ్చని సూచించింది. గతంలో పేర్కొన్న కొన్ని నిబంధనలకు ప్రభుత్వం తాజాగా సడలింపులు కల్పించింది. ఈమేరకు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఈ ప్రజాసేవ కార్యక్రమం ఒకేసారి 30 నిమిషాల పాటు నిరంతరాయంగా ప్రదర్శించనక్కర లేదని, మధ్యమధ్యన స్వల్ప విరామం ఇవ్వవచ్చని పేర్కొంది. వాణిజ్య ప్రకటనల ఈ ప్రసారం చేసేటప్పుడు వాణిజ్య ప్రకటనలకు 12 నిమిషాల పరిమితిని పరిగణించబోమని పేర్కొంది. అయితే ప్రైవేట్ ఛానళ్ల వారు నెలవారీ నివేదికలను బ్రాడ్‌కాస్ట్ సేవా పోర్టల్ ద్వారా సమర్పించాలని సూచించింది.

జాతీయ ప్రాధాన్యం కలిగిన సామాజిక సంబంధమైన ఎనిమిది అంశాలపై రోజూ 30 నిమిషాల పాటు ప్రసారం చేయాలని గత ఏడాది నవంబర్‌లో మంత్రిత్వశాఖ ప్రైవేట్ ఛానళ్లను ఆదేశించింది. దీనిపై గత ఏడాది నవంబర్ 9 న మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే ప్రైవేట్ శాటిలైట్ టెలివిజన్ ఛానళ్ల వారితో విస్తృతంగా చర్చించిన తరువాత సోమవారం కొన్ని సడలింపులు కల్పిస్తూ తాజా ఆదేశాలు జారీ చేసింది. అనేక టివి ఛానళ్లు ఈ కంటెంటెను పంచుకోడానికి వీలు కల్పించింది. వివిధ ఆధారాల ద్వారా లభించిన ప్రయోజనకరమైన సమాచారం పొందుపర్చుకునేలా ఉమ్మడి ఇ ప్లాట్‌ఫారాన్ని భద్రతగా ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొంది.

అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రజాసేవ సమాచారాన్ని ప్రసారం చేయరాదని ఆంక్షలు విధించింది. ఇదివరకు ప్రకటించిన ప్రాధాన్య అంశాలు విద్య, అక్షరాస్యత ప్రచారం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, సైన్సు, టెక్నాలజీ, మహిళా సంక్షేమం, బలహీన వర్గాల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, సాంస్కృతిక వారసత్వం, జాతీయ సమగ్రత, తదితర అంశాలతోపాటు కొత్తగా జల సంరక్షణ, ప్రకృతి వైపరీత్య నివారణ యాజమాన్యం, అంశాలను ఆ జాబితాలో చేర్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News