- Advertisement -
న్యూఢిల్లీ: పాఠశాలలో ఒకటవ తరగతిలో చేరేందుకు కనిష్ఠ వయసును ఆరేళ్లుగా ఖరారు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలను కేంద్ర విద్యా శాఖ బుధవారం ఆదేశించింది. నూతన జాతీయ విద్యా విధానం(ఎన్‌ఇపి) ప్రకారం మూడేళ్ల నుంచి 8 పంవత్సరాల వరకు పిల్లలందరికీ ఐదేళ్లపాటు నేర్చుకునే అవకాశాలు ఉండాలి. ఇందులో మూడేళ్లపాటు ప్రీస్కూలు విద్య ఉంటుంది. ఆ తర్వాత 1వ తరగతి, 2వ తరగతి మొదలవుతాయి.
మూడేళ్లపాటు పిల్లలకు అంగన్‌వాడీలు, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్, ఎన్‌జిఓ ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లలో నాణ్యమైన ప్రీస్కూల్ విద్య అందాలని విద్యా శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆరేళ్లు, అంతకుపైన వయసు ఉన్న పిల్లలను మాత్రమే 1వ తరగతిలో చేర్చుకునేలా నిబంధనలు మార్చాలని రాష్ట్రాలు, యుటిలను కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది.
- Advertisement -