మౌలిక సదుపాయాలు కల్పిస్తాం..
మరిన్ని విభాగాల్లో పెట్టుబడులు పెట్టండి
ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియూకు సిఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
కొంగరకలాన్‌లోని కార్యాలయాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి
మనతెలంగాణ/హైదరాబాద్ : ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులతో సిఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కొం గరకలాన్‌లోని ఫాక్స్‌కాన్ కార్యాలయానికి మం త్రి శ్రీధర్ బాబుతో కలిసి సిఎం రేవంత్ వెళ్లారు. ఈ సందర్భంగా ఫాక్స్‌కాన్ పురోగతిపై ప్రతినిధు లను సిఎం రేవంత్ వివరాలు అడిగి తెలుసుకు న్నారు. ఫాక్స్‌కాన్ సంస్థ చైర్మన్ యాంగ్ లి యూతోనూ సిఎం రేవంత్ వీడియో కాన్ఫరె న్స్‌లో మాట్లాడారు.
కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాలకు సంబంధించి సిఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో మరిన్ని విభాగా ల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని సిఎం కోరారు. ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీ విభాగాల్లో నూ పెట్టుబడులు పెట్టాలని సిఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.2023లో ఫాక్స్ కాన్ కంపెనీ తెలంగాణ లో పెట్టుబడులు పెట్టింది. కొంగర కలాన్‌లోని 250 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ కంపెనీని ఏర్పాటు చే యాలని ఫాక్స్‌కాన్ నిర్ణయించింది. దాదాపు ల క్ష మంది యువతకు ఉద్యోగావకా శాలు కల్పిం చేందుకు పెట్టుబడులు పెట్టబోతున్న ట్లు ఫాక్స్ కాన్ సీఈఓ యంగ్ లియు సైతం వెల్లడించారు.