Tuesday, November 5, 2024

సిద్దిపేటలో ప్రభుత్వ ఆయూష్ ఆసుపత్రి

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట : ఆయుష్‌కి మంచి భవిష్యత్ ఉంది. మారుతున్న పరిస్ధితుల నేపథ్యంలో సాంప్రదాయ వైద్యానికి రోజు రోజుకు ప్రాదాన్యత పెరుగుంది. ప్రజలు దీనిపై ఆసక్తి చూపుతున్నారు. ఆయుష్‌ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రాముఖ్యత గురించి ప్రచారం కల్పించాలి. అన్ని విధాల మద్దుతు అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది. అందుకే నిదర్శనం ఆయూష్ ఆసుపత్రులు. మంత్రి హరీశ్‌రావు చోరవతో రూ. 15 కోట్లతో 50 పడకల ఆయూష్ ఆసుపత్రి ఏర్పాటు కానుంది. సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ప్రాంతంలో 30 గుంటల స్థలంలో ఆయూష్ ఆసుపత్రి ఏర్పాటు కానుంది. నేడు మంత్రి హరీశ్‌రావు శంకుస్ధాపన చేయనున్నారు.

ఆయుష్ ఆయుర్వేదం, యోగ, నాగురోపతి, యునాని,సిద్ద హోమియో ఇందులో దేని ప్రత్యేకత దానిదే ఈ ఆసుపత్రిలోనే ఒకే చోట ఏర్పాటు కానుంది. అయుర్వేదం, హోమియో , యునాని, యోగపై మక్కువ ఉంటే ఆరోగ్యం బాగుంటుంది అనే నమ్మకం ఉండే ప్రజల ఇదోక శుభవార్త. ఆయుర్వేదంతో ఆయూష్ పెంచుకునే పాత తరం ప్రజలకు అయూష్ ఆసుపత్రి వరంగా మారనుంది. ఈ ఆయూష్ ఆసుపత్రి ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొంది పూర్తి స్ధాయిలో ఫిజియో థెరఫి లాంటివి చేస్తూ సంపూర్ణ ఆరోగ్యం పొందేందుకు వైద్య కళాశాల ఆసుపత్రి అందుబాటులో ఉండే విధంగా ఈ ఆయూష్ ఆసుపత్రిని వైద్య కళాశాల ఆసుపత్రి వద్ద నిర్మాణం కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News