Sunday, December 22, 2024

వృద్ధులకు ఆరోగ్య బీమా

- Advertisement -
- Advertisement -

దేశంలో ఇకపై 70 సంవత్సరాలు పైబడ్డ వారందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తారు. 70 ఏండ్లు, అంతకు మించిన వయస్కులైన పౌరులను ఆరోగ్య బీమా కల్పన సంబంధిత ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (ఎబి పిఎం జెఎవై) పరిధిలోకి చేరుస్తారు. బుధవారం ప్రధాన మంత్రి మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఈ కీలక నిర్ణయానికి ఆమోదం దక్కింది. ఈ వివరాలను కేబినెట్ భేటీ తరువాత సమాచార ప్రసారాల మంత్రి అశ్వనీ వైష్ణవ్ విలేకరులకు తెలిపారు. ఆదాయ పరిమితి వంటి నిబంధనలకు అతీతంగా వయోవృద్థులను ఈ స్కీం పరిధిలోకి చేర్చుతారు. దీని వల్ల దేశంలోని నాలుగున్న కోట్ల కుటుంబాలకు చెందిన మొత్తం 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య చికిత్సల ప్రయోజనం చేకూరుతుంది.

ఈ ఆరోగ్య బీమా యోజన పరిధిలోకి వచ్చేవారికి రూ 5 లక్షల వరకూ ఉచిత ఆరోగ్య చికిత్సలకు వీలుంటుంది. 70 ఏండ్లు పైబడ్డ వారికి ఈ పథకం ఉపయోగపడేలా వారికి నూతన రీతిలో ప్రత్యేకంగా ఉండే కార్డులను జారీ చేస్తారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేపడుతారని అధికారులు ఆ తరువాత తెలిపారు. కాగా దేశంలో ఎలక్ట్రానిక్ వాహనాల వాడకం పెంచేందుకు వీలుగా ప్రతిపాదించిన పిఎం ఈ డ్రైవ్ పథకానికి కూడా కేంద్రం సమ్మతి తెలిపింది. దీనికి రూ 11వేల కోట్ల వరకూ కేటాయించారు. ఇక 31,350 మెగావాట్ల ఉత్పత్తి లక్షపు జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి రూ 12,461 కోట్ల వనరులకు కేంద్రం ఆమోదం దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News