Monday, December 23, 2024

17న పార్లమెంట్ ఫ్లోర్ లీడర్లతో అఖిలపక్ష సమావేశం: కేంద్రం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందు సెప్టెంబర్ 17వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు అన్ని పక్షాలకు చెందిన సభా నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్లహ్లాద్ జోషి ఎక్స్‌లో(పూర్వ ట్విట్టర్)లో ప్రకటిస్తూ అన్ని పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లకు ఈమెయిల్ ద్వారా ఆహ్వానాన్ని పంపినట్లు తెలిపారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరగనున్నాయి.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏమిట్లో ప్రభుత్వం ఇప్పటివరకు వెల్లడించకపోవడంతో అనేక ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఇండియా పేరును భారత్‌గా మారుస్తూ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టవచ్చని కొందరు ఊహిస్తున్నారు. ఇటీవల జి20 విందు సమావేశానికి రాష్ట్రపతి పంపిన ఆహ్వానపత్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడం, జి20 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నేమ్‌ప్లేట్‌పై భారత్ అని రాసి ఉండడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది.
కాగా, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో చర్చించాల్సిన ముఖ్యమైన అంశాలను వివరిస్తూ కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ఒక లేఖ కూడా రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News