Thursday, January 23, 2025

ఈ నెల 17న అఖిలపక్ష భేటీకి ప్రభుత్వం పిలుపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : విపక్షాలకు అజెండా ఉత్కంఠతోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈ నెల 18న ఆరంభమవుతాయి. 17న మధ్యాహ్నం 4.30 గంటలకు ప్రభుత్వం పార్టీల సభా పక్ష నేతలు (ఫ్లోర్ లీడర్స్ ) సమావేశం నిర్వహిస్తుంది. ఈ విషయాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ బుధవారం ట్విట్టర్ (ఎక్స్) ద్వారా వెలువరించారు. పలు ఊహాగానాలు, ఏం చర్చనీయాంశాలు, ఎటువంటి బిల్లులు ఉంటాయనేది తేల్చకుండానే ఉన్నట్లుండి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పార్లమెంట్ స్పెషల్ సెషన్ గురించి ప్రకటించింది. ఈ నెల 18 నుంచి జరిగే పార్లమెంట్ ప్రత్యేక సెషన్‌కు పార్టీల నేతల భేటీకి సంబంధిత నేతలకు ముందుగా వారివారి ఇమెయిల్స్ ద్వారా తెలియచేయడం జరిగింది. తరువాత వారికి లేఖలు పంపించడం జరుగుతుందని మంత్రి ఓ ప్రకటన వెలువరించారు. దీనికి సంబంధించి కన్నడ అనువాదాన్ని కూడా పొందుపర్చారు. కన్నడలో ఈ ట్వీటు వెలువరించడం విశేషంగా మారింది. జోషి కర్నాటకలోని ధార్వాడ్ నియోజకవర్గ ఎంపిగా ఉన్నందున తమ భాషలో కూడా దీనిని పొందుపర్చారు.

సోమవారం జరిగే ఫ్లోర్‌లీడర్స్ భేటీలో పార్లమెంట్ ప్రత్యేక భేటీ అజెండా గురించి తెలియచేస్తారని వెల్లడైంది. ఈ సెషన్‌లో జమిలి ఎన్నికల గురించి చెపుతారా? దేశం పేరును ఇండియా నుంచి భారత్‌కు మారుస్తారా? ఉమ్మడి పౌరస్మృతి గురించి బిల్లు తీసుకువస్తారా? లేదా ఇతర ఏదైనా విషయం ప్రస్తావిస్తారా? అనేది చర్చనీయాంశం అయింది. ప్రత్యేక సెషన్ విషయంలో ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని, ముందుగా విపక్షాలకు చెప్పాల్సిన బాధ్యత లేదా అని ఇటీవలే కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ ప్రధాని మోడీకి లేఖరాశారు. ఎవరికి ముందస్తు సమాచారం లేదని, పైగా ఈ మొత్తం ఐదురోజుల సెషన్ అంతా కూడా ప్రభుత్వ ఏకపక్ష కార్యకలాపాల వ్యవహారంగా ఉంది. క్వశ్చన్ అవర్, జీరో అవర్‌లు లేవని తెలిసిందని, ఇది అన్యాయం కాదా అని ప్రశ్నించారు.

అఖిల పక్ష భేటీ ఎందుకు? సిపిఐ నేత రాజా
ప్రభుత్వం అన్ని విషయాలను ఏకపక్షంగా ఖరారు చేసుకుంటున్నప్పుడు ఇక ఒక్కరోజు ముందు అఖిలపక్ష భేటీ వల్ల ఉపయోగం ఏముంటుందని సిపిఐ నేత డి రాజా విమర్శించారు. ఇది కేవలం మొక్కుబడి వ్యవహారం అని తెలిపారు. స్పెషల్ సెషన్‌కు ముందు ప్రభుత్వం విపక్ష నేతలతో చర్చించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. అజెండా ఏమిటనేది తెలియదు. దేనిపై చర్చ జరుగుతుందనేది తెలియదు. ఇదేం ధోరణి అని ప్రశ్నించారు. కాగా గణేష్ చతుర్థి ఉత్సవాల దశలో పార్లమెంట్ సెషన్ పెట్టడం తమకు ఇబ్బంది కల్గిస్తుందని మహారాష్ట్రకు చెందిన విపక్ష ఎంపీలు విమర్శించారు. కాగా సంచలనాత్మక విషయాలు ఏమీ ఉండవని, అయితే దేశం బలీయ ఆర్థిక శక్తిగా మారడం , జి 20 సదస్సు విజయవంతం, చంద్రయాన్, ఆదిత్యా ఎల్ 1 సక్సెస్‌లు వంటివాటిని ప్రభుత్వం ఈ దశలో ప్రత్యేకంగా ప్రస్తావిస్తుందని అధికార బిజెపి ఎంపిలు కొందరు తెలిపారు. ఇక సెషన్‌లోనే పార్లమెంట్ కొత్త భవనంలోకి మారడం, ఇది గణేష్ చవితిరోజు జరగడం వంటి పరిణామాలు ఉంటాయని యుపికి చెందిన ఓ ఎంపి చెప్పారు.

అజెండా ఏమిటనేది ఆ ఇద్దరికే తెలుసు ః విపక్షం విమర్శ
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఉన్నట్లుండి ఖరారు చేయడం, అజెండా ఏమిటనేది తెలియచేయకపోవం విచిత్రంగానే కాకుండా నిరంకుశంగా ఉందని ప్రతిపక్షాల నేతలు విమర్శించారు. అజెండా గురించి ఎవరికి తెలియదు. కేవలం ఆ ఇద్దరికే దీని గురించి లోగుట్టు తెలిసినట్లుగా ఉందని, ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై ప్రతిపక్ష నేతలు విమర్శలకు దిగారు. సెషన్ సరే, సంగతి ఏమిటనేది తెలియచేయకపోవడం సముచితమా? నిర్ణీత అజెండాతోనే ఈ ప్రభుత్వం ఏకపక్షంగా ఈ దాగుడుమూతకు దిగుతోందని ఎంపిలు మండిపడ్డారు. ఇండియా పేరు భారత్‌కు మార్చడం మోడీ, షాల ప్రధాన ఆలోచన అయిందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News