Friday, February 7, 2025

ప్రధాని మోడీ.. ఫ్రాన్స్, అమెరికా పర్యటన షెడ్యూల్ ఖరారు

- Advertisement -
- Advertisement -

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ఫ్రాన్స్, అమెరికా పర్యటన షెడ్యూల్ ఖరారు అయ్యింది. ఈ నెల 10 నుంచి 12 వరకు ప్రధాని మోదీ ఫ్రాన్స్‌లో పర్యటిస్తారని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌తో కలిసి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ యాక్షన్‌ కమిటీ సమావేశానికి మోడీ అధ్యక్షత వహించనున్నట్లు చెప్పారు.

కెడారచీ థర్మో న్యూక్లియర్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ రియాక్షర్‌ను ప్రధాని పరిశీలించనున్నారని..అనంతరం, అక్కడి నుంచి అమెరికా పర్యటనకు ప్రధాని వెళ్లనున్నట్లు తెలిపారు, ఈ నెల 12, 13 తేదీల్లో అమెరికా పర్యటిస్తారని.. అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోడీ భేటీ కానున్నారని వెల్లడించారు. రెండవ సారి అమెరికా ప్రెసిడెంట్ గా ఇటీవలవ బాధ్యతలు చేపట్టిన ట్రంప్.. అమెరికా పర్యటనకు ప్రధాని మోడీని ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News