Wednesday, January 22, 2025

క్రూడ్ పెట్రోలియంపై విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు

- Advertisement -
- Advertisement -

దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న క్రూడాయిల్‌పై విండ్‌ఫాల్ పన్నును ప్రభుత్వం టన్నుకు రూ. 5700 నుంచి రూ. 5200కు శనివారం తగ్గించింది. ఈ పన్నును ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం (ఎస్‌ఎఇడి) రూపంలో విధిస్తుంటారు. డీజెల్, పెట్రోల్, జెట్ ఇంధనం లేదా ఎటిఎఫ్‌పై ఎస్‌ఎఇడిని ‘శూన్యంగా’ కొనసాగిస్తున్నారు. కొత్త రేట్లు శనివారం నుంచి అమలులో ఉంటాయి. భారత్ మొదటిసారి 2022 జూలై 1న విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధించింది. తద్వారా ఇంధన సంస్థల అత్యధిక లాభాలపై పన్ను విధించే దేశాల జాబితాలో భారత్ చేరింది. గత రెండు వారాల్లో సగటు ఆయిల్ ధరలను బట్టి ప్రతి 15 రోజులకు ఈ పన్ను రేట్ల సమీక్ష జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News