Monday, December 23, 2024

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల వేతనాలు విడుదల

- Advertisement -
- Advertisement -

 

Govt degree colleges Lecturers salary released
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు గత సంవత్సరానికి సంబంధించిన పెండింగ్ జీతాలను ఉన్నత విద్య కమిషనర్ విడుదల చేసినందుకు తెలంగాణ గవర్నమెంట్ డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వినోద్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 202021 ఆర్దిక సంవత్సరంలో కళాశాలు వేతనాల బిల్లు సమర్పించడంలో ఆలస్యం కావడంతో అన్ని లాప్స్ అయ్యాయని, ఆపెండింగ్ జీతాలను విడుదల చేయాలని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావును కోరడంతో అందకు వారు సహృదయంతో స్పందించి వాటిని విడుదల చేశారని, పెండింగ్ వేతనాల విడుదలకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విశేష కృషి చేశారని ప్రశంసించారు. అందుకు సిఎం కెసిఆర్ మా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడు తన వంతు కృషి చేస్తున్న పెద్దలందరికి కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలను ఆర్దం చేసుకునే ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News