Monday, December 23, 2024

ప్రశ్నపత్రం లీక్ చేసినందుకు బుల్‌డోజర్లతో శిక్ష

- Advertisement -
- Advertisement -

 

జైపూర్: సెకండ్ గ్రేడ్ టీచర్ల నియామకానికి సంబంధించిన ప్రశ్నపత్రం లీక్ కేసులో నిందితులకు చెందిన కోచింగ్ సెంటర్‌ను రాజస్థాన్ ప్రభుత్వం సోమవారం బుల్‌డోజర్లతో కూల్చివేసింది. జైపూర్‌లోని గోపాల్‌పురా బైపాస్ రోడ్డులో ఐదు అంతస్తులలో నడుస్తున్న ఆదిఘం కోచింగ్ సెంటర్‌లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ జైపూర్ అభివృద్ధి సంస్థ(జెడిఎ)కు చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం సోమవారం ఉదయం బుల్‌డోజర్లతో కూల్చివేతలు చేపట్టింది. ప్రశ్నపత్రం లీక్ కేసులో ప్రధాన నిందితులైన సురేష్, ధాకా, భూపేంద్ర సరన్ తదితరులు నిర్వహిస్తున్నారు.

రోడ్డును ఆక్రమించుకుని ఐదంతస్తుల భవనాన్ని నిర్మించారని జెడిఎ నోటీసులు జారీచేసింది. గత ఏడాది డిసెంబర్ 25న సెకండ్ గ్రేడ్ టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్షను ప్రభుత్వం నిర్వహించనుండగా, కొందరు అభ్యర్థులకు ముందుగానే ప్రశ్నపత్రం అందినట్లు వెల్లడి కావడంతో ఈ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ కేసులో 55 మందిని రాజస్థాన్ పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేశారు. కాగా..ప్రశ్నపత్రం లీక్ కేసులో ప్రధాన నిందితులకు చెందిన కోచింగ్ సెంటర్‌ను కూల్చివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష బిజెపి సమర్థించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News