మొత్తం ఉద్యోగుల సంఖ్య 34,14,226
బడ్జెట్లో పేర్కొన్న ఆర్థికమంత్రి
న్యూఢిల్లీ: 2021 మార్చి 1 వరకల్లా రెండేళ్లలో కొత్తగా 1,43,113 ఉద్యోగాల కల్పన జరగనున్నట్టు కేంద్ర బడ్జెట్ అంచనాల్లో తెలిపారు. 2019 మార్చి 1 వరకల్లా కేంద్రప్రభుత్వంలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 32,71,113 కాగా, నూతన ఉద్యోగాలతో కలిపి వచ్చే మార్చి 1కల్లా ఈ సంఖ్య 34,14,226కి చేరుకుంటుందని బడ్జెట్లో పేర్కొన్నారు. విభాగాలవారీగా ఇచ్చిన లెక్కల్లో కొన్ని ఇలా ఉన్నాయి.. ఈ రెండేళ్ల కాలంలో వ్యవసాయ రంగంలో కొత్తగా 2207 ఉద్యోగాలు కల్పిస్తుండగా, మొత్తం సంఖ్య 5,826కు చేరుకోనున్నది. పౌర విమానయానశాఖలో కొత్తగా 1058 ఉద్యోగాలు కల్పిస్తుండగా, మొత్తం సంఖ్య 2312కు చేరుకోనున్నది. రక్షణశాఖలో కొత్తగా 12,537 పౌర ఉద్యోగాలను కల్పిస్తుండగా, మొత్తం సంఖ్య 93,000కు చేరుకోనున్నది. ఆరోగ్య ,కుటుంబ సంక్షేమశాఖలో కొత్తగా 4072 ఉద్యోగాలు కల్పిస్తుండగా, మొత్తం సంఖ్య 24,979కి చేరుకోనున్నది.
సాంస్కృతికశాఖలో కొత్తగా 3638, ఎర్త్ సైన్సెస్లో 2859, పర్యావరణం, అడవులశాఖలో 2263, విదేశీ వ్యవహారాల్లో 2204, వాణిజ్యశాఖలో 2139, ఎలక్ట్రానిక్స్, ఐటి విభాగంలో 1452, కార్మికశాఖలో 2419, సమాచార,ప్రసారశాఖలో 1848, నీటి వనరులు, నదుల అభివృద్ధిశాఖలో 1456, పశుసంవర్థకశాఖలో 995, మత్సశాఖలో 651, గనులశాఖలో 5305, వ్యక్తిగత సిబ్బంది, ప్రజా ఫిర్యాదులశాఖలో 2684 ఉద్యోగాల కల్పన జరగనున్నదని పేర్కొన్నది.