Thursday, January 30, 2025

భార్య కోసం భర్త పదవీ విరమణ..వేదిక పైనే భార్య మృతి

- Advertisement -
- Advertisement -

అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తన భార్య బాగోగులు చూసుకునేందుకు ఓ భర్త తన ప్రభుత్వ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నాడు. ఇకనుంచి ఆమెను కంటికి రెప్పలా కాపాడుకోవాలనుకున్నాడు. కానీ ఆయన పదవీ విరమణ ఫంక్షన్ లోనే భార్య తుదిశ్వాస విడిచింది. రాజస్థాన్ లోని కోటాకు చెందిన దేవేంద్రసందాల్ కేంద్ర గిడ్డంగుల విభాగంలో పనిచేస్తున్నారు. ఆయన భార్యదీపిక గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతోంది.

ఈ దంపతులకు సంతానం లేదు. దీంతో ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని మూడేళ్లుముందుగానే వీఆర్‌ఎస్ తీసుకున్నారు. ఆఫీస్ సిబ్బంది దేవేంద్రకు పదవీ విరమణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు తన భార్య దీపిక కూడా హాజరైంది. దంపతులిద్దర్నీపూలమాలలు, శాలువాలతో సత్కరిస్తుండగా దీపిక వెనక్కి ఒరిగిపోయారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News