- Advertisement -
వాహనదారులకు ఊరట
న్యూఢిల్లీ : వాహనాలకు సంబంధించిన లైసెన్సులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల వంటి అధికారిక పత్రాలు అక్టోబర్ 31 వరకూ చెల్లుబాటు అవుతాయి. ఈ మేరకు ఇప్పటి గడువును పొడిగించారు. కొవిడ్ 19 వైరస్ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని వాహన పత్రాలను ఈ నెలాఖరు వరకూ ఇప్పుడున్నవాటినే లెక్కలోకి తీసుకోవాలని రహదారులు, జాతీయ హైవేల మంత్రిత్వశాఖ సంబంధిత ఆర్టిఎ ఇతరత్రా ఉన్నతాధికారులకు ఆదేశాలు వెలువరించారు.
- Advertisement -