Monday, December 23, 2024

టాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం అండ

- Advertisement -
- Advertisement -
  • ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి

గజ్వేల్: టాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్ ప ట్టణంలోని స్థానిక క్యాంపు కార్యాయలంలో టాక్సీ బస్సు డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యుడు ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు చేస్తున్న అభివృద్ధి పనులు అద్భుతం అంటూ డ్రైవర్లకు అందిస్తున్న రూ. 5 లక్షల ప్రమాద బీమాకు ఆకర్షితులై వంటేరు ప్రతాప్‌రెడ్డి సమక్షంలో సుమారు 200 మంది డ్రైవర్లు బిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి గుర్తింపు కార్డులు అందజేశారు. వారికి పార్టీ కండువాలు కప్పి బిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. చైర్మన్ మాట్లాడుతూ గజ్వేల్ నియోజక వర్గానికి టాక్సి బస్సు డ్రైవర్లు అందరు సిఎం కెసిఆర్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ బిఆర్‌ఎస్‌తోనే మాయొక్క ప్రయాణం అని చెప్పడం చాలా అభినందనీయమన్నారు.

ప్రభుత్వం రాబోయే రోజుల్లో డ్రైవర్లకు ప్రభుత్వం తరుపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఓనర్ కమ్ డ్రైవర్ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సో దరులకు 60 శాతం సబ్సీడితో ప్రతి ఏటా వాహనా లు అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటున్న విషయాన్ని గుర్తు చేశారు. పార్టీలో చేరిన వారిలో టా క్సి సెక్టార్ రాష్ట్ర అధ్యక్షుడు అత్తిన మోని నగేశ్‌కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహ్మద్ షాహిముద్దిన్, జిల్లెల మహేందర్‌రెడ్డి, సిద్దిపేట జిల్లా ఇంచార్జి అభి కనకయ్య, గజ్వేల్ నియోజక వర్గ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శిలాసారం దశరథ్, ఉపాధ్యక్షుడు అబ్బి నర్సింహులు, ప్రధాన కార్యదర్శి దాసరి మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.

గజ్వేల్‌లో.. కరెంట్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖయలను వ్యతిరేకిస్తూ వర్గల్ మండలం నెంటూరు గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పార్టీని వి డారు. సోమవారం గజ్వేల్ పట్టణంలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో బిఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఎఫ్‌డిసి చైర్మన్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భ ంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఖాళీ అవుతుందని రై తులందరు కాంగ్రెస్‌ని వ్యతిరేకిస్తూ స్వచ్ఛందంగా పార్టీని విడుతున్నట్లు తెలిపారు. మూడు గంటల కరంట్ విధానం వద్దు మూడు పంటలు కావాలని గ్రామాల్లో అంటున్నారని ఆయన చెప్పారు.

వర్గల్ మండలం నెంటూరు గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు, దళిత నాయకులు దాదాపు 150 మందికి పైగా బిఆర్‌ఎస్‌లో చేరడం జరిగిందని చైర్మన్ తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో దళితులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకునేవారని దళిత బంధు పథకం ద్వారా 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తూ దళితులు అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పా ర్టీలో చేరిన వారిలో మాజీ ఎంపిటిసి డాకని సత్తయ్య, కిష్టయ్య, ఆశోక్, బిక్షపతి, రామస్వామి, రమేశ్, కిష్టయ్య, రమేశ్, బాల్ సాయి, రమేశ్, ఎల్లం, శ్రీను, జాన్, కార్తీక్‌లు చేరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు వెంకట్‌రెడ్డి, రమేశ్‌గౌడ్, రామకృష్ణారెడ్డి, శ్యామల, షాదుల్లా, బిక్షపతి, లకా్ష్మరెడ్డి, రాములు,కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News