- Advertisement -
న్యూఢిల్లీ: ఐదుగురు సిబిఐ అధికారులతోపాటు ఓ సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను కేంద్ర ప్రభుత్వం బలవంతంగా పదవీ విరమణ చేయిస్తున్నట్టుగా అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. ఐదుగురిలో ఒకరు ఎఎస్‌పి కాగా, నలుగురు డిఎస్‌పిలని చెబుతున్నారు. రిటైర్ అవుతున్న అధికారులకు మూడు నెలల జీతభత్యాలను చెల్లించనున్నారు. ప్రాథమిక నిబంధనల్లోని 56(జె) క్లాజ్ ప్రకారం వారికి మూడు నెలల ముందే నోటీసులు జారీ చేయాలి. వయసుతోపాటు తగిన సామర్థంతో పని చేయడం లేదని భావించినపుడు ముందస్తుగా రిటైర్ చేయించే అధికారం ప్రభుత్వానికున్నది.
- Advertisement -