Tuesday, December 24, 2024

పెండింగ్ చలాన్లపై రాయితీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్.. ఈ రోజు నుంచే వర్తింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: తెలంగాణలో పెండింగ్ చలాన్లపై రాయితీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం జీవో విడుదల చేసింది. పెండింగ్ చ‌లాన్ల‌పై డిస్కౌంట్ ఇస్తూ ర‌వాణా శాఖ కార్య‌ద‌ర్శి ఉత్త‌ర్వులు జారీ చేశారు. దీంతో ఈరోజు నుంచే పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తించనుంది.

వాహనాదారులు తమ పెండింగ్ చలాన్లను ఆల్ లైన్ ద్వారా చెల్లించుకోవచ్చు. ద్విచక్ర, త్రిచక్రా వాహనాలపై 80 శాతం, ఆర్టీసీ బస్సులు, ఇతర భారీ వాహనాలపై 90 శాతం రాయితీ, కార్లపై 60శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించించిన విషయం తెలిసిందే. ఈ పెండింగ్ చలాన్లను జ‌న‌వ‌రి 10వ తేదీ వ‌ర‌కు ఈ-చలాన్‌ ద్వారా చెల్లించేందుకు అవకాశం కల్పించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News