Monday, December 23, 2024

ఐపిసి స్థానంలో భారతీయ న్యాయ సంహిత: రాజ్యసభలో బిల్లులు

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: భాకతీమ శిక్షా స్మృతి(ఇండియన్ పీనల్ కోడ్), సిఆర్‌పిసి అండ్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో మూడు కొత్త బిల్లులను నరేంద్ర మోడీ ప్రభుత్వం శుక్రవారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. సమాజ సేవను శిక్షగా గుర్తించడం, దర్యాప్తులో సాంకేతికత, ఫోరెన్సిక్ సైన్సెస్‌ను ఉపయోగించడం, ఎలెక్టానిక్ పద్ధతి ద్వారా సమన్లు జారీచేయడం, ఎలెక్టానిక్, డిజిటల్ రికార్డులను సాక్షంగా అంగీకరించడం వంటివి ఈ బిల్లులో ప్రభుత్వం పొందుపరిచింది.

ఇండియన్ పీనల్ కోడ్‌ను రద్దు చేసి దాని స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిల్లు, 2023ను, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ను రద్దు చేసి దాని స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, 2023ను, ది ఎవిడెన్స్ యాక్స్ స్థానంలో భారతీయ సాక్ష బిల్లు, 2023ను రాజ్యసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ మూడు బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే..ఈ బిల్లులను మొదట ప్రవేశపెట్టనున్న బిల్లుల జాబితాలో చేర్చలేదు. కాని తర్వాత అనుబంధ జాబితా ద్వారా ప్రవేశపెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News