బాయిలర్ల క్రమబద్ధీకరణకు, స్టీమ్‌బాయిలర్ల పేలుడు ప్రమాదాల నుంచి వ్యక్తుల ప్రాణ, ఆస్తి రక్షణకు, రిజిస్ట్రేషన్‌లో ఒకే రీతికి ఉద్దేశించిన ఒక బిల్లును లోక్‌సభ మంగళవారం ఆమోదించింది. బాయిలర్ల బిల్లు 2024ను నూరు సంవత్సరాల నాటి బాయిలర్ల చట్టం 1923 స్థానంలో తీసుకురావడమైంది. ఆ బిల్లును నిరుడు డిసెంబర్‌లో రాజ్యసభ ఆమోదించింది. ఏడు నేరాల తీవ్రతను తగ్గించి, వ్యాపార సౌలభ్యాన్ని ప్రోత్సహించడం లక్షంగా ఉన్న బిల్లును ఎగువ సభ మూజువాణి వోటుతో ఆమోదించింది. బాయిలర్ల లోపల పని చేసే వ్యక్తులకు భద్రత ఉండేలా నిబంధనలు కూడా బిల్లులో ఉన్నాయి. బాయిలర్ల మరమ్మతును అర్హులైన. సమర్థ వ్యక్తులు చేపట్టాలని కూడా బిల్లు నిర్దేశిస్తోంది.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బిల్లును ప్రవేశపెడుతూ, వలలవాద శకపు పునరావృత, కాలం చెల్లిన నిబంధనలను తొలగించినట్లు బిల్లు వలసవాద మనస్తత్వానికి స్వస్తి పలుకుతున్నట్లు తెలియజేశారు. ‘మేము బిల్లును తేలికగా, పఠనయోగ్యంగా చేశాం’ అని మంత్రి చెప్పారు. కొంత మంది సభ్యుల ఆందోళనలను గోయల్ పరిహరిస్తూ, ఈ చట్టం రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను కైవసం చేసుకోదని స్పష్టం చేశారు. రాష్ట్రాల హక్కులు వేటినీ ఈ చట్టంతో కైవసం చేసుకోలేదని మంత్రి సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ చట్టాన్ని పూర్వపు కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేసిందని విమర్శించినప్పుడు గోయల్ సమాధానం సమయంలో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు.