Thursday, January 23, 2025

రెజ్లర్లను చర్చలకు ఆహ్వానించిన కేంద్రం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రెజ్లర్ల నిరసనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్ని సమస్యలను చర్చించేందుకు సిద్ధంగా
ఉన్నామని తెలియచేస్తూ ఆందోళన చేస్తున్న రెజ్లర్లను చర్చలకు రావలసిందిగా కేంద్ర ప్రభుత్వం
బుధవారం తెల్లవారుజామున ఆహ్వానించింది. కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం
తెల్లవారుజాము 12.45 గంటలకు ట్విట్టర్ వేదికగా ఈ మేరకు ఆహ్వానించారు. రెజ్లర్లతో వారి సమస్యలపై
చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందుకోసం రెజ్లర్లకు మరోసారి ఆహ్వానించాను అంటూ ఆయన
ట్వీట్ చేశారు.
రెజ్లర్లు వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చలు జరిపిన
కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషం. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్
భూషణ్ పై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన
ఢిల్లీ పోలీసులు ఇప్పటికే 12 మంది వాంగ్మూలాలను నమోదు చేశారు.
================

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News