Sunday, January 19, 2025

30నాటికి ధాన్యం కొనుగోళ్ల ప్రణాళిక

- Advertisement -
- Advertisement -

వానాకాలం 65లక్షల ఎకరాల్లో వరిసాగు కోటి 20లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి
అంచనా జిల్లాల వారీగా కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై సమీక్షలు
గన్నీ సంచుల సేకరణపై దృష్టి దసరా తర్వాత కోతలు ప్రారంభం

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ సారి రికార్డు స్థాయిలో వరినాట్లు జరగటంతో పంట దిగుబడి కూడా పెద్ద ఎత్తున రాబోతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతుల నుంచి ధాన్యం కొ నుగోళ్ల ప్రణాళికప సిద్దం చేస్తోంది. ఈ నెల చివరినాటికి రాష్ట్ర స్థాయిలో ధాన్యం కొనుగోలు ప్రణాళిక సిద్దం కానుందని అధికారులు చెబుతున్నా రు. వానాకాలం పలు జిల్లాల్లో ముం దస్తుగా సాగుచేసిన వరిపైరు కోతల కు సిద్ధంగా ఉంది. దసరా తర్వాత వరికోతలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం కూడా ఆలోపే ధాన్యం కొ నుగోలు ప్రణాళిను సిద్ధ్దం చేసే దిశగా కసరత్తులు చేస్తోంది. రాష్ట్రంలో ఈ వా నాకాలం వరిసాగు సాధారణ విస్తీర్ణం 42.04లక్షల ఎకరాలుగా అంచనా వేసింది. అయితే సకాలంలో వర్షాలు కురిసి చెరువులు కుంటలు నిండిపోవటం, ప్రధాన ప్రాజెక్టలకు కూడా స మృద్ధిగా నీరు చేరడంతో రైతులు రె ట్టించిన ఉత్సాహంతో వరిసాగు చేశా రు. ఈ వానాకాలం 65లక్షల ఎకరాల్లో వరినాట్లు వేశారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఈసారి వరిసాగు ఆల్ టైం రికార్డను సృష్టించింది. గత వానాకాలం సీజన్‌లో 62.13లక్షల ఎకరాలు సాగు కాగా, ఈ సారి మరో 3 లక్షల ఎకరాల్లో అధికంగా వరినాట్లు పడ్డాయి. ఉమ్మడి నల్లగొండి జిల్లాలో నే 12లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. నల్లగొండ జిల్లాలో 4.90లక్షల ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 4.70లక్షల ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 3లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. నిజామాబాద్ జిల్లాలో 4.16లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. రాజన్నసిరిసిల్లలో 3.63లక్షలు, జగిత్యాలలో 3.09లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. కరీంనగర్ జిల్లాలో 2.71లక్షలు , కామారెడ్డిలో 2.83లక్షలు, మెదక్‌లో 2.95లక్షలు ఎకరాల్లో వరిసాగు చేశారు. మిగిలిన జిల్లాల్లో కూడా వరిసాగు విస్తీర్ణం గణనీయంగానే పెరిగింది. ఈ సారి రాష్ట్రంలో ధాన్యం దిగుబడి 1.15కోట్ల మెట్రిక్‌టన్నులకు చేరుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర అర్దగణాంక శాఖ ముందస్తు అంచనాలు వేసింది.

దసరా నుంచి వరికోతలు ప్రారంభం:

రాష్ట్రంలో వరికోతలు దసరా నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం కూడా జిల్లాల వారీగా వరిసాగు, ధాన్యం దిగుబడి అంచనాలపై వ్యవసాయ , పౌరసరఫరాలు, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ల అధ్యక్షతన సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. గ్రామాల వారీగా ధాన్యం కొనగోలు కేంద్రాలు, ధాన్యం దిగుబడి అంచనాలు, గన్ని సంచుల అవసరం , టార్పాలిన్లు, ధాన్యం శుద్దికి ప్యాడీ క్లీనర్లు, వేయింగ్ యంత్రాలు, ధాన్యంలో తేమను కొలిచే యంత్రాలు తదితర వాటిని సమకూర్చుకోవాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. కొనుగోలు కేంద్రాల వద్ద కూలీల సమస్య లేకుండా ముందు జాగ్రత్తులు తీసుకోవాలని సూచించింది. ధాన్య కొనుగోలు కేంద్రాల నుంచి కేటాయించిన మిల్లులకు ధాన్యం చేరవేసేందుకు తగినన్ని వాహనాలు కూడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది.

ధాన్య నిల్వకు వసతులపై ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలో వానాకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం నిల్వలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వం అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలిచ్చింది. గత యాసంగి సీజన్‌లో సేకరించిన ధాన్యం నిల్వలు ఇంకా రైస్‌మిల్లుల్లో పేరుకుని పోయాయి. దీంతో వానాకాలం వచ్చే ధాన్యం నిల్వకు అధికశాతం మిల్లుల్లో జాగా లభ్యత తక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ మార్కెట్ యార్డులు, ప్రవేటు గిడ్డంగులు , ఇతర ఖాలీ ప్రాంతాలను పరిశీలన చేస్తున్నారు. ధాన్యం నిల్వకు అనువైన ప్రాంతాలను ముందుగానే గుర్తించి , అవసరాల మేరకు వాటిని వినియోగించుకునేలా అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News